లేటెస్ట్ గా విడుదలైన అమీర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్’ కలెక్షన్లు తెలుగు రాష్ట్రా లలో అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ఉత్తరాది రాష్ట్రాలలో సంతృప్తి  కారంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ వర్గాల ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఈమూవీ మొదటి మూడు రోజులకు 60 కోట్లు వసూలు చేసింది అని టాక్.  


ఈ మూవీకి ఎక్స్ ట్రాడినరి టాక్ రాకపోయినప్పటికీ డీసెంట్ టాక్ ఉండటంతో ఈమూవీ కలక్షన్స్ నెమ్మదిగా పెరుగుతున్నాయి అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈసినిమాకు పోటీగా ‘కుబేర’ హిందీ వెర్షన్ విడుదల అయినప్పటికీ ఆసినిమాను బాలీవుడ్ ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోకపోవడంతో అమీర్ ఖాన్ సినిమా కు పరిస్థితులు బాలీవుడ్ అనుకూలించినట్లు కనిపిస్తోంది.


ఈ పరిస్థితులుఇలా ఉండగా ఈమూవీ చాల బాగుంది అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేయడం మరింత సంచలనంగా మారింది. వాస్తవానికి మాహేశ్ బాబు టాలీవుడ్ లో సంచలనాలు క్రియేట్ చేస్తున్న ‘కుబేర’ మూవీ గురించి ఎటువంటి కామెంట్స్ చేయకుండా బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ సినిమాకు సపోర్ట్ ఇవ్వడం షాకింగ్ న్యూస్ గా మారింది.


క్ప్రస్తుతం కొనసాగుతున్న కలక్షన్స్ ట్రెండ్ చూస్తుంటే అమీర్ ఖాన్ గండం గట్టెక్కినట్లే అని అనిపిస్తోంది. ‘లాల్ సింగ్ చద్దా’ ఘోరమైన ఫ్లాప్ తరువాత షాక్ అయిన అమీర్ ఖాన్ కొంత కాలం గ్యాప్ తీసుకుని ‘సితారే జమీన్ పర్’ మూవీని తీశాడు. ఈసినిమా పై ఉన్న నమ్మకంతో అమీర్ ఖాన్ ఎనిమిది వారాల తర్వాత యూట్యూబ్ పే పర్ వ్యూ మోడల్ లో ఈసినిమాను సోషల్ మీడియాలో విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లాంటి బడా సంస్థలు అమీర్ ఖాన్ ఈసినిమా ఓటీటీ రైట్స్ గురించి బేరసారాలు అడుతూట్లు టాక్. గత కొంత కాలాంగా వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న అమీర్ ఖాన్ కు ఈమూవీ సక్సస్ కొంతవరకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు..    


మరింత సమాచారం తెలుసుకోండి: