ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే .. అల్లు అర్జున్‌ కెరియర్ లోనే కాకుండా ఇండియన్ సిని చరిత్రలోనే అత్యధిక VFX షార్ట్స్ తో ఈ సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది .. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ య‌క్టివిటీస్ లో అల్లు అర్జున్ తో పాటు దర్శకుడు అట్లీ కూడా ఎంతో కీలకంగా ప్లాన్ చేస్తున్నారు .. సినిమా అనౌన్స్మెంట్ వీడియో తోనే ప్రేక్షకుల్లో ఓ రకమైన అంచనాలు పెంచేశారు .. ఇదే క్రమంలో సినిమా జానెర్ ఏంటి అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేనప్పటికీ .. అల్లు అర్జున్ ఒక భారీ VFX మూవీ చేస్తున్నారనే దాంట్లో మాత్రం స్పష్టమైన క్లారిటీ వస్తుంది ..  ఇక ఈ సినిమాకు సంబంధించిన VFX పనులను అమెరికాలోని ఓ హాలీవుడ్ VFX కంపెనీకి అప్పగించినట్టు తెలుస్తుంది .. 

ఇక ఈ సినిమా VFX పనులను చూసుకునేందుకు .. ఒక VFX ఎక్స్పెక్ట్ టీం అమెరికా నుంచి ముంబై వచ్చినట్టు కూడా తెలుస్తుంది .. ఇక వారు ఈ సినిమా షూటింగ్ అయ్యేవరకు మొబైల్ లోనే ఉండబోతున్నారని కూడా అంటున్నారు .. అలాగే ఈ సినిమాకు సంబంధించిన కొంత షూటింగ్ అమెరికాలో కూడా ప్లాన్ చేస్తున్నారట .. ఇక ఈ నెలాఖరు వరకు ముంబైలో షెడ్యూల్ షూటింగ్ జరగనుంది . అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా దీపికా పదుకొనే నటిస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా క్లారిటీ వచ్చింది .. కానీ ఆమె ఇంకా ఈ సినిమా షూటింగ్లో ఎంట్రీ ఇవ్వలేదు .. అలాగే మృణాళ్‌ ఠాకూర్ తో పాటు జాన్వి కపూర్ కూడా ఈ సినిమాల్లో ఒక కీలక పాత్రలో నటించబోతున్నారు .. ఇక మరోపక్క అల్లు అర్జున్ కూడా ముంబైలోనే ఉంటూ ఈ సినిమా షూటింగ్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నాడు ..

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌ , సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి ..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు , రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తం గా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి .

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు ..

మరింత సమాచారం తెలుసుకోండి: