
ప్రొఫెషనల్ లైఫ్ బాగానే సక్సెస్ అవుతున్న సమయంలో పర్సనల్ లైఫ్ మాత్రం చాలా ఇబ్బందులకు గురిచేసింది ఈ నటుడును.. దీంతో కుటుంబ సభ్యులతో పాటు అటు ఆర్థికంగా కూడా అన్ని ఇబ్బందులు చుట్టూ ముట్టాయి. దీంతో మానసికంగా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కూడా పొన్నాంబళం ను చుట్టుముట్టడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్నేళ్లుగా రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బ తినడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా రూ.50 లక్షల రూపాయల వరకు వైద్య ఖర్చుల కోసం చిరంజీవి కూడా సహాయం చేశారు. ఈ విషయాన్ని పొన్నాంబళం చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అక్కడక్కడ కనిపించిన పొన్నాంబళం కుదురుకున్నాడు అనుకునే లోపు అయితే ఇప్పుడు మళ్లీ ఆసుపత్రిలో చేయడంతో కొంతమేరకు ఆందోళన కలిగిస్తోంది. 1988లో మొదటిసారిగా కలియుగం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో మాత్రం 1992లో ఘరానా మొగుడు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. రేపటి రౌడీ, అల్లరి ప్రియుడు, మెకానిక్ అల్లుడు, హిట్లర్, ముగ్గురు మొనగాళ్లు, పవిత్ర ప్రేమ ఇలా సుమారుగా ఒక 20కి పైగా చిత్రాలలో నటించారు. ఈ నటుడు ఆరోగ్యం పైన కుటుంబ సభ్యులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.