
ఇటీవలె స్టార్ సింగర్ సీజన్ 10 లో కనిపించిన చిత్ర తనకు జరిగిన ప్రమాదం పైన క్లారిటీ ఇచ్చింది.. తన భర్తతో కలిసి సింగర్ చిత్ర చెన్నై విమానాశ్రయంలో ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలియజేసింది. కొంతమంది అభిమానులు ఫోటోలు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఎవరో తనతో ఫోటో తీసుకోవాలని ఉత్సాహంతో తన కాలు వెనుక టేబుల్ మీద ఉంచాల్సిన ఒక ట్రైన్ వదిలి వెళ్ళిపోయారు. అయితే తాను చూసుకోకుండా వెనకడుగు వేయడంతో ట్రాక్ తగిలి బ్యాలెన్స్ తప్పి పడిపోయానని దీంతో తన భుజం దగ్గర ఎముక అంగుళంన్నర పక్కకు జరిగిందంటూ తెలిపింది సింగర్ చిత్ర.
దీంతో తనని ఆసుపత్రికి తీసుకువెళ్లి తన భర్త చికిత్స అందించారని డాక్టర్స్ కూడా ఎముక సరిచేసి మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని తెలిపింది. కానీ తాను మాత్రం మూడు నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉన్నానని వెల్లడించింది చిత్ర ఇందుకు సంబంధించిన ఒక వీడియో కూడా మాధ్యమికాలలో వైరల్ గా మారుతుంది దీంతో చిత్ర అభిమానులు కూడా త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు నాలుగున్నర దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్న సింగర్ చిత్ర ఇప్పటివరకు 25వేలకు పైగా పాటలు పాడింది.