ఇదంతా సోషల్ మీడియా యుగం.  ఏదైనా సరే సోషల్ మీడియాలో ఇట్టే ట్రెండ్ అయిపోతూ ఉంటుంది.  మరీ ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన రివ్యూల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఈ సినిమా రివ్యూల వల్ల కొన్ని సినిమాలు హిట్ అయితే కొన్ని సినిమాలు ఫ్లప్ అయ్యాయి . అయితే సినిమాకి ఉన్నది ఉన్నట్లు రివ్యూలు ఇచ్చిన సరే కొంతమంది స్టార్స్ మాత్రం మండిపడుతూ ఉంటారు . ఈ క్రమంలోనే చాలామంది  సినిమా రివ్యూలు ఎత్తేస్తే బాగుండ్రా బాబు అని అనుకుంటూ వచ్చారు. కాగా సినిమా రివ్యూల పై నిషేధం విధించడానికి మద్రాస్ హైకోర్టు నిరాకరించింది.
 

అలా చేయడం భావప్రకటన స్వేచ్ఛను హరించడమే అంటూ పేర్కొంది . రీసెంట్గా తమిళ సినిమా నిర్మాతల సంఘం సినిమా విడుదలైన మూడు రోజులు రివ్యూలు రాకుండా ఆపాలి అంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది . అయితే గురువారం ఆ కేసు విచారణకు రాగ జస్ట్ ఆనంద్ వెంకటేష్..ఆ పిటీషన్ ని కొట్టిపడేశారు . సోషల్ మీడియా యుగంలో రివ్యూల పోస్ట్ చేయకుండా ఆపడం అనేది అసాధ్యమైంది అని .. న్యాయస్థానం గుర్తు చేసింది.  నిర్మాతలు రీవ్యూవర్లు  పాజిటివ్ రివ్యూలే ఆశించలేరని ఏ రంగం చెందిన వారైనా సరే సామాజిక మాధ్యమాలలో ట్రోల్స్ కి గురవుతున్న అంశాన్ని ఈ సంధర్భంగా కోర్టు ప్రస్తావించింది .



కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన "కంగువ" సినిమా సామాజిక మాధ్యమాలలో తీవ్ర విమర్శలకు గురైంది అని అందరికీ తెలిసిందే.  ఆ సమయంలోనే ..సినిమా రిలీజ్ అయిన మూడు రోజులపాటు రివ్యూవర్స్ రివ్యూ లు ఇవ్వకుండా ఆపాలి అని నిర్మాత సంఘం కోర్టును ఆశ్రయించింది . అయితే కోర్టు మాత్రం దాన్ని సున్నితంగా తిరస్కరించింది . అలా మేము చేయలేం అంటూ తేల్చి చెప్పేసింది . కాగా ఈ సినిమా రివ్యూల వల్లే కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అని సినిమా బాగున్న కూడా నెగిటివ్ రేటింగ్ ఇస్తూ సినిమాలకు హిట్ టాక్ రాకుండా చేస్తున్నారు అనేది కొంతమంది నిర్మాతలు అభిప్రాయం.  అయితే జనాలు మాత్రం ఓపెన్ గానే దీనిపై స్పందిస్తున్నారు. ఎవరో రివ్యూలు చెప్పినంత మాత్రాన మీ సినిమా ఫ్లాప్ అవుతుందా..? కధా కంటెంట్ ఉంటే ఎంతమంది రివ్యూలు నెగిటివ్గా రాసిన మీ సినిమా చూడడానికి థియేటర్ కి జనాలు ఎగబడి వస్తారు. రివ్యూర్లపై పడడం కాదు కధా కంటెంట్ పై  కాన్సన్ట్రేషన్ చేయండి అంటూ కూసింత ఘాటుగానే కొంతమంది కౌంటర్స్ వేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: