
కన్నప్ప సినిమా హిట్ అవ్వడానికి కర్త - కర్మ - క్రియ అంతా కూడా ప్రభాస్ పాత్ర అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు కన్నప్ప సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ మరింత వైరల్ గా మారాయి. కాగా ఈ సినిమా కోసం విష్ణు చాలా చాలా కష్టపడ్డాడు అని తెరపై సినిమా చూసిన ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది . కాగా ఈ సినిమాలో రుద్ర పాత్ర కోసం ముందుగా ప్రభాస్ కన్నా జూనియర్ ఎన్టీఆర్ ని అనుకున్నారట. ఆ తర్వాత అది క్యాన్సిల్ చేసుకుని ప్రభాస్ వద్దకు వచ్చారట .
అదే విధంగా అక్షయ్ కుమార్ - మోహన్ లాల్ పాత్రల కోసం వేరే వారిని ముందుగా అప్రోచ్ అయ్యారట. వాళ్ళు రిజెక్ట్ చేయగా ఆ పాత్రలకు మోహన్ లాల్ అదేవిధంగా అక్షయ్ కుమార్ ఫైనలైజ్ అయి ఇప్పుడు స్క్రీన్ పైకి కనిపిస్తున్నారు . అయితే ఈ సినిమాలో పార్వతి దేవి పాత్రలో నటించి ఆకట్టుకుంది కాజల్. అయితే కాజల్ కంటే ముందు విష్ణు ఈ పాత్రలో నయనతారను అనుకున్నారట . నయనతార ఈ పాత్రకు చాలా చాలా న్యాయం చేయగలదు అన్న విషయం అందరికీ తెలిసిందే .
అయితే రెమ్యూనరేషన్ కారణంగానే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందట. ఆ తర్వాత మంచు విష్ణు చాలామంది హీరోయిన్స్ ని చూస్ చేసుకోగా.. ఫైనల్లీ కాజల్ సెలెక్ట్ అయింది . ఏ మాటకు ఆ మాట మంచు విష్ణు టేస్ట్ అదిరిపోయింది ఏ పాత్ర ఎవరికీ బాగుంటుంది ఎవరికి ఎలా సూట్ అవుతుంది అన్న విషయాన్ని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు. సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా చాలా అద్భుతంగా ఉంది . ఎవరు తమ పాత్రకి ఎంత చేయాలో అంతే చేశారు. ఎక్కడ ఎక్కువ లేదు ఎక్కడ తక్కువ లేదు . కానీ ఫస్ట్ ఆఫ్ మాత్రం కొంచెం స్లోగా ఉంది అని నెగిటివ్ కామెంట్ మాత్రం దక్కించుకుంటుంది కన్నప్ప..!