ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. కన్నప్ప మూవీ సూపర్ డూపర్ హిట్ . అయినా సరే మంచు విష్ణు ఫాన్స్ హ్యాపీగా లేరు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . దానికి కారణం ఓ స్టార్ హీరో . అతడే ప్రభాస్.  రెబెల్ హీరో ప్రభాస్ కన్నప్ప సినిమాలో  రుద్ర పాత్రలో నటించాడు.  ప్రభాస్ ఒక పాన్ ఇండియా హీరో . ఇలాంటి ఒక క్యారెక్టర్ లో కనిపిస్తాడా..? నటిస్తాడా..? అంటూ ఎంతో మంది సందేహాలు వ్యక్తం చేశారు. కానీ అదంతా తుడిచిపెట్టుకుపోయేలా చేసాడు ప్రభాస్ .


రుద్ర పాత్రలో ప్రభాస్ నటించలేదు జీవించాడనే చెప్పాలి . ప్రభాస్ క్యారెక్టర్ ఈ సినిమాకి హైలెట్ గా మారింది. పెద్దపెద్ద స్టార్ హీరోస్ సినిమాలో గెస్ట్ పాత్రల్లో నటించడానికి ఒప్పుకోరు. కానీ ప్రభాస్ మాత్రం కధా.. కంటెంట్ బాగుంటే ఎలాంటి స్టోరీ అయినా చేస్తాను అని గతంలో ఎన్నో సార్లు చెప్పారు . దాన్ని  స్పెషల్ గా ప్రూవ్ చేసుకున్నాడు ప్రభాస్ . కన్నప్ప సినిమా రుద్ర అనే పాత్రలో ప్రభాస్ నటించిన తీరు అందరినీ మెస్మరైజ్ చేసింది . చాలా చాలా బాగా నటించి అందరిని ఆకట్టుకున్నాడు హీరో ప్రభాస్ .



ఇంకా పక్కాగా చెప్పాలి అంటే సినిమాలో హీరో క్యారెక్టర్ చేసిన మంచు విష్ణు కొంతమేర మాత్రమే పాజిటివ్ కామెంట్స్ దక్కించుకున్నాడు . కానీ ప్రభాస్ తన సీన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్ హైలెట్గా నిలిచాడు అని జనాలు విపరీతంగా పొగిడేస్తున్నారు.  సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్  సంపాదించుకుంది.  రిలీజ్ అయిన అన్నిచోట్ల కూడా మంచి టాక్ సంపాదించుకుంది. అయితే మంచి విష్ణు ఫ్యాన్స్ మాత్రం సినిమాల్లో విష్ణు కన్నా ప్రభాస్ క్యారెక్టర్ నే హైలెట్ అవ్వడం పట్ల కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు.  ప్రతి రివ్యూ లోను ప్రతి కామెంట్లోనూ విష్ణు పేరు కన్నా కూడా ప్రభాస్ పేరు హైలెట్ గా ఉంది . ఇంచుమించు ఈ సినిమా మొత్తం ప్రభాస్ నే నడిపించాడు అని .. ఈ సినిమాకి కర్త - కర్మ - క్రియ మొత్తం ప్రభాస్ నే అని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: