బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతోంది.. ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి SSMB 29 చిత్రంలో నటిస్తూ ఉన్న ప్రియాంక చోప్రా గురించి నిరంతరం ఏదో ఒక న్యూస్ అయితే వినిపిస్తూ ఉంది. తాజాగా ప్రియాంక చోప్రా పైన మాజీ ప్రపంచ సుందరి ముక్తాముఖి చేసిన కామెంట్స్ పెను సంచలనంగా మారుతున్నాయి. 1999లో ముక్తాముఖి మిస్ వరల్డ్ టైటిల్ ని గెలుచుకుంది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ముక్తాముఖి ప్రియాంక చోప్రా పై ఇలా మాట్లాడింది.



ప్రియాంక చోప్రా తనకు జూనియర్ అని ఆమె 2000 సంవత్సరంలో అందాల పోటీలలో పాల్గొనిందని ఆ సమయంలో తన దగ్గరికి తరచూ వచ్చేది అలా కొన్ని సలహాలను కూడా తనని అడిగేదని తెలిపింది ముక్తాముఖి. అలా తనని కూడా తాను ఎన్నోసార్లు గైడ్ చేశానని వాళ్ల పేరెంట్స్ కూడా తరచూ తమ ఇంటికి వచ్చేవారని తెలియజేసింది. ఇక ప్రియాంక చోప్రా లో పెద్దగా చెప్పుకోదగ్గ విషయాలు ఏవి లేవని ఆమె తనను ఎప్పుడూ కూడా ఒక పోటీల భావించేది.. తన కెరీర్ కి కూడా ఎక్కడ పోటీ వస్తానో అంటూ చాలా భయపడేది ప్రియాంక చోప్రా అంటూ తెలిపింది ముక్తాముఖి.


ప్రియాంక చోప్రాలో పొగిడేంత గొప్ప విషయాలు ఏవి లేవు అంటూ పలు సంచలన కామెంట్స్ చేయడంతో ఈ విషయాలు వైరల్ గా మారడంతో అభిమానులు ఈ మాజీ ప్రపంచ సుందరి పైన ఫైర్ అవుతున్నారు. ప్రియాంక చోప్రా కు టాలెంట్ లేకపోతే ఇంతలా ఎదుగుతుందా అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయం పైన ప్రియాంక చోప్రా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి. ప్రస్తుతం ప్రియాంక చోప్రా అమెరికాలో తన కుటుంబంతో కలిసి అక్కడే నివసిస్తోంది. అప్పుడప్పుడు సినిమా షూటింగ్లకు మాత్రమే ఇండియాకు వచ్చి వెళ్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: