
పలు సినిమాలలో స్పెషల్ క్యారెక్టర్స్ లో కామెడీ యాంగిల్ లో నటించి మెప్పించిన హైపర్ ఆది.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అన్న వార్త వైరల్ కావడానికి మెయిన్ రీజన్ హీరోయిన్ శ్రీలీల. ఆమె కుటుంబ సభ్యులతో ఆయన భేటీ అయ్యారు అంటూ ఓ న్యూస్ తెర పైకి వచ్చింది. శ్రీలీల స్వగ్రామం ఒంగోలు . హైపర్ ఆది కూదా ఒంగోలే. ఆ కారణంగా నే మర్యాదపూర్వకంగా వాళ్లతో మీట్ అయ్యారా..? లేకపోతే ఇది ప్లానింగ్ లో భాగమ..? అంటూ ఒంగోలులో పుకార్లు షికార్లు చేస్తున్నాయి .
కాపు సంఘం నాయకులు మండల మురళీకృష్ణతో హైపర్ ఆది బేటి అయ్యారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో హైపర్ ఆది హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది . అంతేకాదు స్టార్ హీరో అంత స్టేటస్ కాకపోయినా హైపర్ ఆదికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది . హీరోగా ఎంట్రీ ఇస్తే తప్పేంటి..? అని కొంతమంది మాట్లాడుతున్నారు . మరికొందరు మాత్రం హైపర్ ఆది హీరోగా ఓకే కానీ ఆయన సినిమాలో శ్రీలీల అంటున్నారు చూసారా అదే అదే పెద్ద జోక్ అంటూ కామెడీగా కామెంట్స్ పెడుతున్నారు . అసలు నిజంగానే హైపర్ ఆది హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడా? ఆ సినిమాలో హీరోయిన్గా శ్రీలీల నటిస్తుందా..? దీనిపై ఎటువంటి అఫీషియల్ ప్రకటన లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు జనాలు. హీరోగా ఆది హీరోయిన్ గా శ్రీ లీల అంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది..!!!