
టాలీవుడ్ క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల .. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ అవెంటెడ్ మూవీ కుబేర .. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా వాటిని అందుకుని బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్‌గా నిలిచింది . అలాగే హీరో ధనుష్ కెరియర్ లోనే వరుసగా మరో రూ. 100 కోట్ల సినిమా గా నిలిచిన ఈ మూవీ .. ఇప్పుడు మరో రేర్ ఫీట్ ని కూడా తన ఖాతా లో వేసుకుంది .. అయితే ఈ సినిమా లో నటించిన ధనుష్ , నాగార్జున కెరియర్ లోనే కాకుండా ఈ సినిమాకి దర్శకత్వం వహించిన శేఖర్ కమ్ముల కెరియర్ లో కూడా హైయెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుంది .
అయితే ఇది యూఎస్ మార్కెట్లో జరగటం మరో విశేషం .. ఇక అక్కడ ఏకంగా 2.1 మిలియన్ గ్రాస్ తో రికార్డ్ బ్రేక్ కలెక్షన్లు అందుకుంది .. అలాగే శేఖర్ కమ్ముల సినిమా లకి యుఎస్ మార్కెట్ లో మంచి ఫేమ్ క్రేజ్ ఉంది . అలానే తన సినిమాలు ఎంతో అద్భుతంగా రాణించాయి .. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా కుబేర తో మళ్ళీ తన సక్సెస్ స్ట్రైక్ కొనసాగించడమే కాకుండా .. ధనుష్ , నాగార్జున హైయెస్ట్ వసూళ్ళని కూడా దాటే రేంజ్ సినిమా ని వాళ్ళకి అందించారు ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ , సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ..