
నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ. 38 కోట్ల వరకు వెనక్కి వచ్చేసాయి .. ఇక ఇప్పుడు జూలై 4న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు .. అయితే ఇప్పుడు అంతా బాగానే ఉంది .. ఇప్పుడు చిత్ర యూనిట్ ఈ సినిమాని సెన్సార్‌కు తీసుకువెళ్లారు . ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలుస్తుంది .. అయితే నితిన్ కు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ .. అలాగే దిల్ రాజు సినిమాలు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఫోకస్ పెడతారు . పైగా తమ్ముడు సిస్టర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉన్నట్టు ట్రైలర్లో చెప్పకనే చెప్పారు ..
ఇక మరి ఇలాంటి సినిమాకి ‘ఎ’ రేటింగ్ ఇస్తే .. మల్టీప్లెక్సుల్లో కలెక్షన్ కి గట్టి దెబ్బ పడుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తుంది .. అయితే ఈ సినిమాలో యాక్షన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుండట .. నైట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే యక్షన్ ఎపిసోడ్లో కొంచెం హారర్ టచ్ కూడా ఉంటుందని అంటున్నారు .. అందుకే ఎ సర్టిఫికెట్ ఇచ్చారని తెలుస్తుంది .. అలాగే కొన్ని సీన్స్ కట్ చేస్తే యూ/ ఏ సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ వాళ్ళు చెప్పారట .. కానీ సినిమా మూడ్ ఎలాంటి డిస్టర్బ్ అవ్వకుండా ఎ రేటింగ్ కి దిల్ రాజు అండ్ టీం ఓకే చెప్పినట్టు తెలుస్తుంది .. అలాగే ఈ సినిమా కూడా బాగుందని సెన్సార్ వారు చెప్పినట్టు తెలుస్తుంది .