
హీరో సిద్ధార్థ మాట్లాడుతూ.." నేను పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతుంది . కానీ ఇప్పటివరకు నా జీవితంలో నేను ఒక ఇంటిని కొనుగోలు చేయలేదు . ల్యాండ్ - ప్రాపర్టీ ఏది కొనుగోలు చేయలేదు.. ఇదే నా ఫస్ట్ ప్రాపర్టీ .. నా జీవితంలో సగానికి పైగా సినిమాలలోనే ఉన్నాను . కానీ ఎప్పుడూ కూడా నేను ఒక ప్రాపర్టీ కొనలేదు . రెండు నెలల ముందు ఒక సొంత ఇంటిని కొన్నాను. ఇప్పుడు నేను తెలంగాణ అల్లుడిని . నాకు బాధ్యతలు పెరిగాయి.. అందుకే కొన్నాను" అంటూ చెప్పుకొచ్చాడు .
దీంతో సోషల్ మీడియాలో హీరో సిద్ధార్ధ్ చేసిన కామెంట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . కాగా అదితికి - సిద్ధార్ధ్ కి ఉన్న కామన్ కోరిక ఈ ఇల్లు. ఆ కారణంగానే ఇల్లు కొన్నారట. కాగా తమకు ఒక ఇంటి పేరు కావాలని ఆ ఇంటి పేరు పై ఓ ఇల్లు కూడా ఉండాలని ఆశ ఉంది అని ఆ కోరికను ఈ మధ్య నేను నేర్చుకున్నానని స్వయంగా సిద్ధార్థ్ తెలిపాడు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో..ఇల్లు ఎప్పుడు కొనుక్కుంటాడో.. అంటూ తన తల్లిదండ్రులు బాగా బాధపడే వాళ్ళు అని చాలా టైం వెయిట్ చేశారని .. ఇన్నాళ్ళకి వాళ్ళకి ఆ రెండు కోరికలు నెరవేరాయి అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు సిద్ధార్ధ్ . సోషల్ మీడియాలో ఇప్పుడు సిద్ధార్ధ్ ఇల్లు కొన్నాడు అన్న విషయం బాగా వైరల్ గా మారింది..!