
ప్రేక్షకుల నుంచి కన్నప్ప పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో దాదాపు 30 నిమిషాలు స్క్రీన్ టైం కలిగిన రుద్ర క్యారెక్టర్ లో ప్రభాస్ నటించాడు. అందుకు ఆయన ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు. సెకండాఫ్ లో వచ్చే ప్రభాస్ పాత్రే సినిమాకు ఆయువు పట్టుగా నిలిచింది. అయితే కన్నప్ప సినిమాలోని ఓ సీన్ ఇప్పుడు చర్చలకు దారితీసింది.
ఈ సీన్ ప్రభాస్-విష్ణు మధ్య సాగుతుంది. తిన్నడు(విష్ణు) నీకు పెళ్లయిందా? అని రుద్ర(ప్రభాస్)ను అడుగుతాడు. అందుకు రుద్ర `నా పెళ్లి గురించి నీకెందుకు?` అంటూ కౌంటర్ ఇస్తాడు. దాంతో విషయం అర్థమైన తిన్నడు.. వెంటనే `పెళ్లి చేసుకుంటే తెలిసేది` అంటూ రీ కౌంటర్ ఇవ్వడం హైలెట్ గా నిలిచింది. ఈ సీన్ థియేటర్స్‌లో అభిమానుల చేత విజిల్స్ వేయిస్తోంది. రియల్ లైఫ్ లోనే కాదు రీల్ లైఫ్ లో నూ ప్రభాస్ బ్యాచిలరేనా అంటూ ఆడియన్స్ తెగ నవ్వుకుంటున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు