కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన మా నగరం అనే సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తరువాత ఖైదీ అనే సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఈయన దర్శకత్వం వహించిన మాస్టర్ , విక్రమ్ , లియో సినిమాలు కూడా మంచి విజయాలను సాధించడంతో ఈయనకు ప్రస్తుతం దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపు ఉంది. ఇది ఇలా ఉంటే ఖైదీ సినిమా చివరన ఆ మూవీ కి సీక్వెల్ ఉండబోతుంది అని మేకర్స్ ప్రకటించారు.

దానితో ఖైదీ మూవీ తర్వాత చాలా తక్కువ రోజుల్లోనే లోకేష్ "ఖైదీ 2" మూవీ ని మొదలు పెడతాడు అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆయన మాత్రం ఆ తర్వాత చాలా సినిమాలు చేశాడు. కానీ ఖైదీ 2 మూవీ ని మాత్రం ప్రారంభించలేదు. ఇకపోతే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన విక్రమ్ సినిమాలో సూర్య చిన్న క్యామియో పాత్రలో నటించాడు. ఈ మూవీ లో రోలెక్స్ పాత్రలో నటించిన సూర్య తన నటనతో ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్నాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా కార్తీ హీరోగా ఖైదీ 2 మూవీ ని రూపొందించనున్నట్లు ఆ తర్వాత సూర్య హీరోగా రోలెక్స్ టైటిల్ తో మరో మూవీ ని రూపొందించనున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి.

దానితో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అయ్యారు. ఇకపోతే లోకేష్ మాత్రం ఖైదీ 2 మరియు రోలెక్స్ పాత్రల సినిమాలకు సంబంధించి పెద్దగా అప్డేట్లు ఇవ్వకపోవడం అలాగే ప్రస్తుతం కూలీ సినిమాను తెరకెక్కిస్తున్న ఆయన ఆ తర్వాత అమీర్ ఖాన్ హీరోగా మూవీ ని రూపొందించనున్నాడు అని వార్తలు రావడంతో కార్తీ , సూర్య ఫ్యాన్స్ లోకేష్ పై కాస్త గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Lk