
రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న ఈ జంట లైఫ్ని చక్కగా ముందుకు తీసుకెళ్తుంది . శోభిత పలు వెబ్ సిరీస్ లల్లో.. సినిమాల్లో బిజీ బిజీగా ఉంది . ఆమె షూటింగ్ - ఫోటోషూట్స్ అంటూ ఎప్పుడూ ముంబైలోనే ఉంటుంది . ఇక నాగచైతన్య సినిమా షూటింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . హైదరాబాద్లో ఆయన ఉండి తీరాల్సిందే. మరి ఇద్దరూ దూరం దూరంగా ఉంటే వాళ్ల మధ్య ప్రేమ ఎలా ఉంటుంది..? మిస్ అండర్ స్టాండింగ్స్ రావా..? అనే విషయాల కారణంగా రీసెంట్గా నాగచైతన్య రెస్పాండ్ అయ్యారు . దానికి చక్కగా ప్లాన్ కూడా చేసుకున్నట్లు వివరించారు .
పెద్దగా ప్లానింగ్ ఏం పెట్టుకోము అంటూనే నాగచైతన్య వీక్ మొత్తం బిజీబిజీగా గడిచిన వీకెండ్ మాత్రం ఒకసారి తనకి నచ్చినట్లు మరొకసారి నాకు నచ్చినట్లు ప్లాన్ చేసుకుంటామని చెప్పుకొచ్చాడు. అంతేకాదు సినిమా చూసినా.. వాకింగ్ చేసిన ..భోజనం చేసిన ఆన్లైన్ లో ఏదైనా ఆర్డర్ పెట్టాలన్న .. ఇలా ఏం చేసినా సరే కలిసి చేయాలి అని మేము పెట్టుకున్న రూల్.. ఆ కారణంగా టైం ఎక్కువ స్పెండ్ చేసినట్లు ఉంటుంది దూరంగా ఉన్నామన్న ఫీలింగ్ కూడా రాదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.
అంతే కాదు ఒక వారం శోభితకు నచ్చినట్లు ఉంటే నెక్స్ట్ వారం నాగచైతన్యకు నచ్చినట్లు శోభిత ఉండాలట. అలా ఒక వారం శొభితను తనకు ఎంతో ఇష్టమైన కార్ రేస్ కి కూడా తీసుకెళ్తాను అనే విషయాన్ని గుర్తు చేసుకున్నాడు నాగ చైతన్య . అంతేకాదు శోభిత కు బుక్స్ అంటే చాలా ఇష్టం అట . తనకి కొన్ని బుక్స్ కూడా సజెస్ట్ చేసిందట. చాలా ప్రశాంతంగా ఉంటుంది బుక్స్ చదివితే అంటూ కూడా క్లారిటీ ఇచ్చాడు నాగ చైతన్య. ఏదేమైనా వారాంతాలు మాత్రం ప్రయాణం భోజనంతో మొదలై తిరిగి భోజనంతో ముగుస్తుంది అంటూ తెలిపాడు. దీంతో ప్రేమంటే ఇలానే ఉండాలి అని నాగచైతన్య-శోభిత చక్కగా తమ లైఫ్ ని ప్లాన్ చేసుకున్నారు అని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. ప్రతి భార్య భర్త ఈ విధంగా ఉంటే అసలు డివర్స్ అన్న మాటకు తావే రాదు అంటూ కూడా హైలెట్ చేస్తున్నారు..!