అక్కినేని హీరో నాగ చైతన్య గత సంవత్సరమై మరో హీరోయిన్ శోభితని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు .. వీరి పెళ్లి హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎంతో ఘనంగా జరిగింది .. గ‌త‌ కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ  పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు .. పెళ్లి తర్వాత కూడా ఆలయాలకు, టూర్లకు వెళుతూ బిజీగా ఉన్నారు .. అయితే నాగచైతన్య , శోభిత కంటే ముందు మరో హీరోయిన్ సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే .. ఇదే క్రమంలో నాగచైతన్య , సమంత కలిసి మొదట్లో ఏం మాయ చేసావే అనే సినిమాలో కలిసిన నటించారు .. ఆ సినిమా సమయంలోనే ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు .. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో కలిసి నటించారు .. అయితే అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ పెళ్లి తర్వాత అనుకోని కారణాలతో సమంత , నాగచైతన్య విడిపోయారు .. టాలీవుడ్ స్టార్ కపుల్ గా మంచి క్రేజ్‌ తెచ్చుకున్న సమంత , చైతన్య విడిపోవడం అభిమానులు అసలు తట్టుకోలేకపోయారు .


సోషల్ మీడియా వేదికగా తాము విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ భారీ షాక్ ఇచ్చారు సమంత , చైతన్య .. ఇక విడిపోయాక కూడా ఎవరి పనుల్లో ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉండిపోయారు .. ఇక మధ్యలో సమంత మాయోసైటిస్ బారిన పడటంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి విశ్రాంతి కూడా తీసుకుంది .. ఇక ఇప్పుడు మళ్లీ తిరిగి సినిమాలతో బిజీగా మారిపోయింది .. మరోవైపు నాగచైతన్య కూడా తన సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు .. ఇదే క్రమంలో శోభిత దూళిపాళ్ళతో ప్రేమలో పడ్డాడు .. శోభిత , నాగచైతన్య కలిసి ఒక సినిమాలో కూడా నటించలేదు .



కానీ సమంత , నాగచైతన్య , శోభిత కలిపి ఓ సినిమాలో నటించార‌ని తెలుస్తుంది .. ఇప్పుడు ఇదే వార్త ఫిలిం వర్గాల్లో తెగ హాట్ టాపిక్ గా మారింది .. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే ..  చైతన్య కెరియర్ లోని  క్లాసిక్ మూవీగా నిలిచిన మజిలీ .. శివ నిర్వాణం దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది .. అయితే ఈ సినిమాలో ముందుగా దివ్యాంక కౌశిక్ క్యారెక్టర్ కు శోభితను అనుకున్నారట దర్శకుడు .. అదే విధంగా శోభిత తో రెండు మూడు సన్నివేశాలు కూడా తెరకెక్కించారట .. ఇక తర్వాత ప‌లు కారణాలతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది .. ఇక దాంతో ఆమె ప్లేస్ లోకి తర్వాత దివ్యాంక కౌశిక్ ను తీసుకున్నారు .. ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో , ఫిలిం వర్గాల్లో వైరల్ గా మారింది .. మజిలీ మూవీ నాగచైతన్య కెరియర్ లోని వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీగా పేరు తెచ్చుకుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: