మంచి విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్టుగా నటించిన కన్నప్ప సినిమా ఈ నెల 27న భారీ బడ్జెట్ పాన్ ఇండియా లెవెల్లో విడుదలయ్యింది. కన్నప్ప చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా చూసిన చాలామంది కూడా ప్రశంసలు కురిపించారు. ఇందులో ప్రభాస్ ,మోహన్ బాబు, మోహన్లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ తదితరునటీ నటులు నటించడంతో ఈ సినిమాపై రేంజ్ పెరిగిపోయింది. మొదటిరోజు 20 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడినట్లుగా కూడా వార్తలు వినిపించాయి. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న కన్నప్ప సినిమా తాజాగా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఈ సినిమాని చూసి ట్విట్ చేసినట్లుగా తెలుస్తోంది.


సినిమా పైన తన అభిప్రాయాన్ని వాట్సప్ ద్వారా మంచు విష్ణు తో పంచుకున్నారు రాంగోపాల్ వర్మ ఇదే విషయాన్ని మంచు విష్ణు కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఆర్జీవి గారు పంపిన మెసేజ్ కూడా స్క్రీన్ షాట్ తీసి మరి షేర్ చేయడం జరిగింది.. కన్నప్ప సినిమా చూశాను అంటూ వర్మ ఇలా మెసేజ్ చేశారని" మొదట నుంచి నాకు దేవుడు భక్తి వంటి అంశాల పైన ఎక్కడ నమ్మకం లేదు ఈ కారణం వల్లే భక్తితో వచ్చే సినిమాలను తాను చూడలేదని కానీ.. తాను చదువుకునే రోజులలో భక్తకన్నప్ప సినిమాను నాలుగు సార్లు చూశాను.. అది కూడా ఆ సినిమాలో నటించిన నటీనటుల కోసమే చూశానని.. ఇక ఇప్పుడు విడుదలైన కన్నప్ప సినిమా విషయానికి వస్తే తిన్నడుగా నువ్వు అద్భుతంగా నటించావు అనడం కంటే జీవించేసావు అంటూ తెలిపారట వర్మ.



భక్తితో వెండితెర పైన కనిపించిన సీన్లు చూసినప్పుడు నీ నటన అద్భుతంగా ఉంది. ఒక్కోసారి ఊపిరి తీసుకొని ఇవ్వడం లేదు సినిమా క్లైమాక్స్ లో శివలింగం నుంచి వచ్చే రక్తాన్ని ఆపేందుకు.. తిన్నడు తన రెండు కళ్ళను సమర్పించే సీన్లు కూడా నీ నటన చాలా అద్భుతంగా ఉందని తెలిపారు.. నేనొక నాస్తికుడిని కానీ ఇలాంటి సన్నివేశాలు తనకు నచ్చవు కానీ నీ నటనతో నన్ను మార్చేసావు అంటూ వర్మ ప్రశంసలు కురిపించారు. చివరిలో నువ్వు చెప్పిన డైలాగులు సీన్స్ అన్నీ కూడా పతాక స్థాయికి చేరాయి ఆ సమయంలో ఎవరైనా సరే చేతులెత్తి నమస్కరించాల్సిందే అంటూ తెలిపారు.


వర్మ పంపించిన మెసేజ్ కి మంచు విష్ణు రియాక్ట్ అవుతూ.. రాము గారు మీరు నన్ను ఏడిపించేశారు చాలా రోజుల తర్వాత నా కన్నీళ్లు ఆపుకోలేకపోయాను ఈ సినిమా నా జీవితంలో అత్యంత సవాల్ గా మిగిలింది.. ఇప్పటివరకు చాలామంది ఈ ప్రాజెక్టు పైన ద్వేషాన్ని మాత్రమే చూపించారు. కానీ నా నమ్మకంతోనే ముందుకు వెళ్లాలని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: