టాలీవుడ్ నటుడు మంచు విష్ణు భారీ విజయాన్ని అందుకొని చాలా కాలమే అవుతుంది. ఈయన నటుడిగా కెరియర్ను మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. అందులో భాగంగా అనేక సినిమాల్లో నటించాడు. ఈయనకు బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందించిన సినిమాలలో డీ సినిమా మొదటి స్థానంలో ఉంటుంది. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ మూవీ తర్వాత విష్ణు చాలా సినిమాల్లో నటించిన ఈ రేంజ్ విజయం మాత్రం ఈయనకు దక్కలేదు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం విష్ణు "జిన్నా" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమాలో పాయల్ రజ్పుత్ ,  సన్ని లియోన్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యింది. ఇకపోతే ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా కేవలం 35 లక్షల గ్రాస్ కలెక్షన్లను మాత్రమే వసూలు చేసింది. ఇక ఈ మూవీ మొదటి రోజు మాత్రమే కాదు ఆ తర్వాత కూడా పెద్ద స్థాయి కలెక్షన్లను వసూలు చేయలేకపోయింది. ఇకపోతే జిన్నా మూవీ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని విష్ణు తాజాగా కన్నప్ప అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో ప్రభాస్ , అక్షయ్ కుమార్ , మోహన్ లాల్ ,  శరత్ కుమార్ , మోహన్ బాబు , కాజల్ అగర్వాల్ లాంటి నటీ నటులు నటించడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో కాస్త మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

తాజాగా ఈ మూవీ జూన్ 27 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి బాక్సా ఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ వచ్చింది. అయిన కూడా ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 16 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక జిన్నా మూవీ మొదటి రోజు కలెక్షన్లతో పోలిస్తే కన్నప్ప కు కలక్షన్లు భారీగా ఎక్కువ వచ్చాయి. దీనితో చాలా మంది ఈ మూవీలో ప్రభాస్ ఉండటం వల్ల ఆ స్థాయి కలెక్షన్లు వచ్చాయి అని కూడా అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: