సినిమా ఇండస్ట్రీలో అత్యంత కష్టాల్లో ఉండేది నిర్మాతలు అని అనేక సందర్భాలలో అనేక మంది చెప్పుకొచ్చారు. అందుకు ప్రధాన కారణం ఒక సినిమాను ఎంతో ఖర్చు పెట్టి , ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని నిర్మించినట్లయితే ఆ సినిమా విడుదల అయ్యి మంచి లాభాలను సాధిస్తేనే నిర్మాత బాగుంటాడు. అదే సినిమా బాగా ఆడకపోయినా మొదటగా నష్టపోయేది నిర్మాత అని , ఆయన ఆర్థికంగా ఎంతో కృంగిపోతాడు అని అనేక మంది చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ఒక నిర్మాత ఒక సినిమాను నిర్మించి దానిని కరెక్ట్ సమయంలో విడుదల చేయడమే కాస్త కష్టం అయిపోయింది.

అలాంటి సమయంలో ఒక నిర్మాత రెండు సినిమాలను నిర్మించినట్లయితే ఆ రెండు సినిమాల విడుదల తేదీలను కరెక్ట్ తేదీన ఉండేలా చూసుకోవాలి. ఇతర మూవీలతో క్లాష్ లేకుండా చూసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిర్మాతలకు చాలా కష్టాలు ఎదురవుతాయి. ఇక ఇలాంటి పరిస్థితులనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటువంటి సూర్య దేవర నాగ వంశీ ప్రస్తుతం ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... నాగ వంశీ ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న మాస్ జాతర సినిమాతో పాటు , విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న కింగ్డమ్ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే మాస్ జాతర మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.

ఇక కింగ్డమ్ మూవీ కి సంబంధించి విడుదల తేదీ పై పెద్దగా క్లారిటీ లేదు. ఈ సినిమాను కూడా ఆగస్టు నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు , ఏకంగా ఈ మూవీ ని ఆగస్టు 27 వ తేదీనే విడుదల చేయనున్నట్లు కూడా ఓ వార్త వైరల్ అవుతుంది. దానితో నాగ వంశీ ఏం చేస్తాడు ..? అసలు ఈ రెండు సినిమాల తేదీలలో ఏమైనా మార్పులు ఉంటాయా ..? అని కొంత మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: