సూపర్ స్టార్ మహేష్ బాబు ఆఖరుగా గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా పరవాలేదు అనే స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం మహేష్ ప్రపంచ వ్యాప్తంగా దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ మూవీకి టైటిల్ ని ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ సినిమా యొక్క షూటింగ్ను ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్తో ఈ మూవీ ని పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి ప్రియాంక చోప్రా , మహేష్ కు జోడిగా నటిస్తోంది. పృధ్విరాజ్ సుకుమారన్ ఈ మూవీ లో అత్యంత కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా ... రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్మూవీ కి కథను అందించాడు. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ కి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. 

ఇంతకు ఇంత క్రేజీ సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్న ఆ బిగ్ బాస్ బ్యూటీ ఎవరు అని అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు అశ్విని శ్రీ. ఈమెకు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు పెద్దగా క్రేజ్ లేదు. కానీ ఈమెకు బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఈ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లో కొన్ని రోజులు ఉన్నా మంచి గుర్తింపును ఈ షో ద్వారా సంపాదించుకుంది. ఈమెకు తాజాగా మహేష్ , రాజమౌళి కాంబోలో రూపొందుతున్న సినిమాలో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వార్త కనుక నిజం అయితే ఈ ముద్దుగుమ్మకు ఇది సూపర్ సాలిడ్ అవకాశం అని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mb