ఇండియన్ బాక్సాఫీ దగ్గర మహేష్ , రాజమౌళి సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోయినా .. వారు ఏం చేస్తున్నారనే విషయం మాత్రం ఆటోమేటిక్గా బయటికి వచ్చేస్తుంది .  కావాలంటే మీరే చూసుకోండి .. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి వచ్చిన ఏ ఒక్క సమాచారం చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ గా బయటకు రాలేదు .. అలా అని వాటిని లీకులు అని కూడా ఎవరు చెప్పలేరు .. ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేని వారు ఈ సినిమా విషయాలను బయటపెడుతున్నారు . అలానే ఇప్పుడు ప్రియాంక చోప్రా కు సంబంధించిన ఒక విషయం బయటకు వచ్చింది .. గతంలో చెప్పినట్టు మహేష్ బాబు అభిమానులు #SSMB29  అని పిలుచుకుంటున్న ప్రాజెక్ట్‌.. రాజమౌళి ఫ్యాన్స్‌ #SSRMB అని పిలుచుకుంటున్న ప్రాజెక్ట్ పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయి ..
 

అయితే ఎక్కడ ఏం చేస్తున్నారనేది మాత్రం ఎక్కడా చెప్పడం లేదు .. ఇదే క్రమంలో ఈ సినిమా ఎక్కువగా ఒడిస్సా నేపథ్యం లో రానుంది అనే క్లారిటీ మాత్రం వస్తుంది .. రీసెంట్గా ఒడిశాలోని ఓ పర్వతప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ చేశారు.  ఇక ఇప్పుడు ఏకంగా ఈ సినిమాల్లో  హీరోయిన్ కు ఒడిశా ప్రత్యేక నృత్యంలో శిక్షణ తీసుకుంటుంది .. మహేష్ , రాజమౌళి , పృథ్వీరాజ్‌ సుకుమారన్  కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా లో హీరోయిన్గా ప్రియాంక చోప్రా నటిస్తుంది .. ఈ క్రమంలోనే ప్రియాంక ప్రత్యేకంగా మయూర్‌ భంజ్‌ ఛౌ అనే ప్రత్యేక నృత్యాన్ని నేర్చుకుంటుంది .. అలాగే ఈ నృత్యంలో ప్రసిద్ధి చెందిన ఒడిశా కళాకారుడు విక్కీ భర్తియ ఆధ్వర్యంలో ప్రియాంకకు శిక్షణ ఇస్తున్నారు.
 

ఇక ఈ క్రమంలోనే  ప్రియాంక తో కలిసి పనిచేసిన తన అనుభవాన్ని వివరిస్తూ కొరియోగ్రాఫర్ విక్కీ ఇటీవల ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ కూడా పెట్టాడు.   గ్లోబల్ బ్యూటీ ప్రియాంక తో వర్క్ చేయడం తనకు ఎంతో ప్రత్యేక అనుభవం ఇచ్చిందని .. అలాగే ఆమె మాతో ఎంతో సరదాగా ఉండేదని అందరితో ఎంతో ఆప్యాయంగా మెలిగేదని .. డాన్స్ రిహార్సల్స్ , చిత్రీకరణ సమయంలో ఆమె ఎనర్జీ చూసినప్పుడు ఎంతో ఇన్స్పైర్గా ఉండేదని .. అలాగే ఈ శిక్షణ సమయంలో నేను ఒక భాగమైనందుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని విక్కీ అందులో రాసుకోచ్చాడు .. ఇక దీంతో మహేష్ , రాజమౌళి సినిమా కోసం ప్రియాంక ఈ ప్రత్యేకమైన శిక్షణ తీసుకుందని నెటిజెన్లు ఒక క్లారిటీకి వస్తున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: