
అయితే ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ కి మరొక అవకాశం సామాన్య ప్రజలకు కూడా కలిగిస్తూ బంపర్ ఆఫర్ ని ప్రకటించింది. బిగ్ బాస్ 9 లో మీరు కూడా పాల్గొనవచ్చు అంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. తాజాగా విడుదల చేసిన వీడియోలో నాగార్జున మాట్లాడుతూ.. ఇన్ని రోజులు మీరు బిగ్ బాస్ ని ఎంతగా ప్రేమించారో, ఆదరించారో చూశాము.. అందుకే మీకు రిటర్న్ గిఫ్ట్ గా ఒకటి ఇస్తున్నాము సెలబ్రిటీలే కాదు మీరు కూడా బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నామంటూ నాగార్జున తెలియజేశారు.
దీంతో బిగ్ బాస్ సీజన్ 9 లో పాల్గొనాలి అంటే..https://bb9.jiostar.com వెబ్ సైట్ లోకి వెళ్లి అక్కడ మీ పేరు మొబైల్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేయించుకుని మీరు బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో అనే విషయాన్ని వీడియో రూపంలో తెలియజేయాలి అంటూ తెలియజేశారు. దీంతో బిగ్ బాస్ టీమ్ పరిశీలించి మరి అందులో కొంతమందిని హౌస్ లోకి పంపించేలా ప్లాన్ చేస్తున్నట్లు చూపించారు. మరి ఎవరైతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలనుకుంటున్నారో వారందరికీ ఇదే చక్కటి అవకాశం అని చెప్పవచ్చు.