సినిమా ఇండస్ట్రీ అంటేనే కత్తి మీద సాము లాంటిది. ఇక్కడ బ్రతకాలి అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి. ముఖ్యంగా ఇండస్ట్రీలో నటీనటులకు కొదువ ఉండదు. కొత్త వారు వచ్చే కొలది పాత వారికీ ఛాన్సులు తగ్గిపోతూ ఉంటాయి. కానీ కొంతమంది నటీనటులు  మాత్రం ఎంతమంది వచ్చిన డోంట్ కేర్ అంటూ ఇండస్ట్రీలో దశాబ్దాల నుండి కొనసాగుతున్నారు. కానీ మరి కొంతమంది ఎన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో సినిమాలు చేసినా కానీ మంచి గుర్తింపు పొందలేకపోతున్నారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అర్జున్ రెడ్డి నటి శ్రీ సాయి సుధా.. ఈమె ఇండస్ట్రీలో ఎప్పటినుంచో కొనసాగుతున్నా కానీ తగిన గుర్తింపు అయితే రాలేదు.  

అలాంటి ఈ అమ్మడు అర్జున్ రెడ్డి సినిమా ద్వారా సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకుంది. సినిమా స్టార్టింగ్ లోనే ఈమె ఓ బోల్డ్ సన్నివేశం లో కనిపిస్తుంది. ఈ బోల్డ్ సీన్ ఆ చిత్రానికే హైలైట్ గా నిలిచిందని చెప్పవచ్చు. అలాంటి ఈ సీన్ చేయడానికి గల కారణాలు ఏంటో శ్రీ సాయి సుధా తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. నేను ఈ బోల్డ్ సన్నివేశం చేయనని చెబితే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చాలా ఒత్తిడి చేశారని తెలియజేసింది. మొదట్లో ఈ సీన్ చేయడానికి నేను ఒప్పుకోలేదని, కానీ డైరెక్టర్ మాత్రం నా మాటలు పట్టించుకోకుండా ఆ సన్నివేశం చేయాల్సిందే అని గట్టిగా అడిగాడని చెప్పింది.

సందీప్ రెడ్డి తరహాలోనే నేను కూడా డాక్టర్ ఫీల్డ్ లోనే ఉన్నాను అందువల్లే ఈ సీన్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. అయితే ఈ బోల్డ్ సీన్ చేస్తే జనాల నన్ను పెద్దగా గుర్తుపట్టరు కావచ్చు అనుకున్నాను. కానీ ఈ సీన్ ఇప్పటికీ కూడా చాలా సందర్భాల్లో ట్రెండ్ అవుతూనే ఉంటుంది అంటూ  శ్రీ సాయి సుధా చెప్పుకొచ్చింది. ఈ బోల్డ్ సీన్స్ చేయడానికి ప్రధాన కారకులు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటూ ఆమె తెలియజేయడం ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది

మరింత సమాచారం తెలుసుకోండి: