టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. ఈమె తమిళ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టింది. కానీ తెలుగు సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. నేను శైలజ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీ తోనే సూపర్ సక్సెస్ను అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత నటించిన నేను లోకల్ మూవీ కూడా మంచి సక్సెస్ అయ్యింది. ఈ మూవీ తర్వాత ఈమె మహానటి అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. ఇందులోని కీర్తి సురేష్ నటనకు అద్భుతమైన ప్రశంసలు దక్కాయి.

ఈ మూవీలోని నటనకు గాను కీర్తి సురేష్ కు ఏకంగా నేషనల్ అవార్డు కూడా దక్కింది. దానితో ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఈమె ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించింది. కెరియర్ ప్రారంభంలో స్కిన్ షో కు కాస్త దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సినిమాలో తన అందాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఉప్పు కప్పు రంబు అనే సినిమాలో నటించింది. ఈ మూవీ లో సుహాస్, కీర్తి సురేష్ ఇద్దరు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ మూవీ జులై 4 వ తేదీన నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా హీరోయిన్ల రెమ్యూనిరేషన్ గురించి చెప్పుకొచ్చింది. కీర్తి సురేష్ తాజాగా మాట్లాడుతూ... కొంత మంది హీరోలకు భారీ ఎత్తున రెమ్యూనరేషన్ ఇస్తూ ఉంటారు. హీరోయిన్లకు అంత పెద్ద రెమ్యూనరేషన్ ఇవ్వరు.

అందుకు ప్రధాన కారణం ఓ క్రేజ్ ఉన్న హీరో నటించిన మూవీ కి జనాలు పెద్ద ఎత్తున వస్తారు. అదే  రేంజ్ క్రేజ్ ను హీరోయిన్లు సంపాదించుకొని వారు నటించిన సినిమాలకు కూడా అదే స్థాయిలో జనాలు థియేటర్స్ కు వస్తున్నారు అంటే హీరోయిన్లకు కూడా పెద్ద మొత్తంలో పారితోషకాలు ఇస్తారు అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక అలాగే నేను పారితోషకం గురించి అసలు పట్టించుకోను అని, కేవలం సినిమా కథ, అందులో నా పాత్ర గురించి ఆలోచిస్తాను అని, పారితోషకం అనేది నా విషయంలో చివరణ వస్తుంది అని ఈమె చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ks