
అంతే కాదు "మైసా" అనే ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలో కూడా నటించబోతుంది . బ్యాక్ టు బ్యాక్ ఖచ్చితంగా ఆమె మరొక మూడు హిట్స్ తన ఖాతాలో వేసుకుంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఇలాంటి మూమెంట్లోనే రష్మిక ఖాతాలోకి వచ్చిన ఆఫర్స్ వచ్చినట్లే వచ్చి చేజారిపోతున్నాయి . దానికి కారణం ఓ యంగ్ హీరోయిన్ . ఆమె మరెఎవరో కాదు "రుక్మిణి వసంత్". సైలెంట్ గా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారిపోతున్న బ్యూటీ రుక్మిణి వసంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . మంచి నటి చాలా చాలా టాలెంట్ ఉంది .
ఆ కారణంగానే ఆమెను చాలా మంది ఇష్టపడుతూ లైక్ చేస్తూ ఉంటారు . కాగా రుక్మిణి వసంత్ ఇప్పుడు ఎన్టీఆర్ తో కూడా డ్రాగన్ మూవీలో నటిస్తుంది. అంతేకాదు రామ్ చరణ్ - సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలోను ఆమె హీరోయిన్గా సెలెక్ట్ అయిందట. నిజానికి ఈ రెండు సినిమాలలో ముందుగా హీరోయిన్గా రష్మిక ని అనుకున్నారట . కానీ నేషనల్ క్రష్ కాకుండా నార్మల్ బ్యూటీతో సినిమా తీసి హిట్టు కొట్టాలి అంటూ మేకర్స్ అనుకోవడం కారణంగానే ఈ ఆఫర్స్ రుక్మిణి ఖాతాలోకి వెళ్లిపోయాయట. అంతేకాదు మరో రెండు అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో కూడా రష్మిక చేయాల్సిన ఆఫర్ రుక్మిణి వసంత్ ఖాతాలో కి వెళ్లినట్లు తెలుస్తుంది . దీంతో అందరూ రష్మిక కి రుక్మిణి వసంత్ శనిలా తయారైంది అంటూ ఘాటుగా కౌంటర్ లు ఇస్తున్నారు. అంతేకాదు పొట్టిది మహాగట్టిదే అంటూ నాటి కామెంట్స్ కూడా చేస్తున్నారు . ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా కామన్ . ఒక హీరోయిన్ కోసం రాసుకున్న కధ మరొక హీరోయిన్ ఖాతాలో పడక తప్పదు . ఇలా హిట్ కొడితేనే మజా అంటూ సినీ ప్రముఖులు కూడా రుక్మిణి వసంత్ కి సపోర్ట్ చేస్తూ అప్రిషియేట్ చేస్తున్నారు..!!