నిజం చాలా చాలా చేదుగా ఉంటుంది.  అంతేకాదు నిజం మాట్లాడితే ప్రతి ఒక్కరికి ముఖాలు మాడిపోతాయి . సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా మాట్లాడే మాటలే  ఇవి. చాలా మంది సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ నిజాన్ని దాపెట్టేసి ఫేక్ మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు . మీడియా అటెన్షన్ కోసం కావచ్చు లేకపోతే ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే కొందరికి నచ్చదు ..ఆ కారణంగా అవకాశాలు పోతాయి అనే రీజన్ కారణంగా కావచ్చు.  ఏదైనా సరే చాలామంది ఇండస్ట్రీలో ఉన్న విషయాన్ని దాపెట్టేసి లేని విషయాన్ని హైలెట్ చేస్తూ ఉంటారు . చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతారు . ఎదుటి వ్యక్తి ఏమనుకున్న నిజమే మాట్లాడుతా అనే స్టార్స్ చాలా చాలా తక్కువ . వాళ్ళల్లో ఒకరే ఈ శిరీష్..దిల్ రాజు బ్రదర్.


వామ్మో శిరిష్ అంటే ఒక ప్రొడ్యూసర్ మాత్రమే అని ఇన్నాళ్లు అనుకున్నారు. కాదు కాదు  ఆయన నమ్మకానికి నిజాయితీకి కేరాఫ్ అడ్రస్ అనే విధంగా ఓ ఇంటర్వ్యూతో సెన్సేషన్ సృష్టించాడు . రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు దిల్ రాజు బ్రదర్ శిరీష్ . ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఫుజులు ఎగిరిపోతున్నాయి . ఇండస్ట్రీలో ఇలా ఉంటుందా..? ఇండస్ట్రీ విధివిధానాలు ఇవా..? ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ లు ఈ విధంగా చేస్తారా..?  డిస్టర్బ్యూటర్స్ ఇన్ని కష్టాలు పడతారా ..? మరి ముఖ్యంగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ పై  శిరిష్ చేసిన కామెంట్స్ సెన్సేషనల్ గా మారిపోయాయి.



అంతేకాదు ఏ ఒక్కరిని పర్సనల్ గా నిందించకుండా ఇండస్ట్రీలో జరుగుతున్న మోసాలపై ఇండస్ట్రీలో ఎలా ఒకరిని తొక్కేస్తారు అన్నదానిపై చాలా చాలా ఓపెన్ గా స్పందించారు శిరిష్. మరి ముఖ్యంగా గేమ్ ఛేంజర్  తర్వాత రామ్ చరణ్ ఫోన్ కాల్ కూడా చేయలేదు అని అదే విధంగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సవ్యసాచి,  గ్యాంగ్ లీడర్ విషయంలో మోసం చేశారు అని.. అలాగే ఆచార్య సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో ఎలా శిరీష్  వెనక్కి తగ్గాడు అని.. ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఒక్క క్వశ్చన్ పై పర్ఫెక్ట్ స్టన్నింగ్ ఆన్సర్ ఇచ్చారు . ఈవీడియో చూసిన ప్రతి ఒక్క నెటిజన్ కూడా శిరీష్ ను తెగ పొగిడేస్తున్నారు . ఆయనకి బిగ్ ఫ్యాన్ అయిపోయారు .



అంతేకాదు ఇలాంటి ఒక డేర్ ఉన్న పర్సన్ ఇండస్ట్రీలో ఉండాలి కానీ మీడియా ముందుకు మాత్రం రాకూడదు అంటూ కొంతమంది కామెంట్ చేస్తుంటే మరికొందరు ఇన్నాళ్లు దిల్ రాజును ఎందుకు మీడియా ముందుకు రానివ్వలేదు ఇప్పుడు అర్థమవుతుంది.. ఇంత బోల్డ్ ఇంత నిజాయితీగా ఉన్న నువ్వు తెర వెనక ఉండడమే కరెక్ట్ అంటూ ఘాటుగా నాటిగా కామెంత్స్ పెడుతున్నారు . మొత్తానికి ఒకే ఒక్క ఇంటర్వ్యూ తో పాన్ ఇండియా స్టార్స్ కి మించిన రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకోవడమే కాదు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిపోయాడు ఈ శిరీష్..!!







మరింత సమాచారం తెలుసుకోండి: