శిరీష్ .. శిరీష్ .. శిరీష్ నిన్న మొన్నటి వరకు ఈ పేరు కేవలం ఒక ప్రొడ్యూసర్ గా..ఒక డిస్ట్రబ్యూటర్ గా .. దిల్ రాజు బ్రదర్ గా మాత్రమే తెలుసు . కానీ నీతి నిజాయితీ దమ్మున్న స్టార్ వీడు అంటూ ఓ రేంజ్ లో కామెంట్స్ వినిపించడానికి కారణం శిరీష్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ . దిల్ రాజు బ్రదర్ శిరీషీ రీసెంట్  గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో శిరీష్  ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది..? ఇండస్ట్రీ అంటే ఏంటి ..? ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ - - ఒక ప్రొడ్యూసర్ ఒక డిస్టర్బ్యూటర్ మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది..? ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఎలా ఉంటుంది ..? ఆ కాంపిటీషన్ ని మనం ఎలా తట్టుకోవాలి..? ఒక సినిమా హిట్ అయితే హీరో ఎలా ఉంటాడు..?  ఫ్లాప్ అయితే ఎలా ఉంటాడు..?? ఒకటా రెండు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న అన్ని విషయాల గురించి కళ్లకు కట్టినట్లు క్లియర్గా వివరించేశాడు.

శిరీష్  మాటల్లో మాట మెగా పవర్ స్టార్ రాంచరణ్ గురించి హోస్ట్ ప్రశ్నించగా ..గేమ్ ఛేంజర్ సినిమా ఫ్లాప్ తర్వాత మేకర్స్ అసలు హీరో - డైరెక్టర్లు పట్టించుకోలేదు అని నార్మల్ గానే స్పందించాడు.  అయితే దీనిపై మెగా ఫాన్స్ మాత్రం ఫుల్ ఫైర్ అయిపోయారు . శిరీష్ ని ఓ  రేంజ్ లో ట్రోల్ చేశారు . అంతే కాదు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎట్టకేలకు దీనిపై శిరీష్ దిగివచ్చి సారీ అంటూ బహిరంగంగా క్షమాపణలు చెప్తూ ఒక పోస్ట్ పెట్టాడు . ఈ పోస్ట్ చూసిన ప్రతి ఒక్కరికి కొత్త డౌట్ లు మొదలయ్యాయి .

శిరీష్ మాటలు.. శిరీష్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన పద్ధతి చూసి ఇప్పుడు ఆయన సారీ అంటూ పెట్టిన పోస్ట్ చూసి ఇది శిరీష్ క్యారెక్టర్ కాదు అంటూ తేల్చేస్తున్నారు . శిరీష్  చాలా నీది నిజాయితీగా దమ్మున్న పర్సన్ గా మాట్లాడాడు . దానికి టోటల్ ఆపోజిట్ గా అనిపిస్తుంది ఈ పోస్ట్ అని ఆయన మనస్పూర్తిగా ఈ "సారీ" చెప్పలేదు అని ఎవరో బలవంతంగానే ఇది ఆయన చేత పెట్టించిన పోస్ట్ అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.  బహుశా దిల్ రాజు ఈ గొడవలు అంతా ఎందుకు అని శిరీష్ కి ఇష్టం లేకపోయినా బలవంతంగా సారీ చెప్పించిన్నట్లు ఉన్నారు అని జనాలు మాట్లాడుకుంటున్నారు . కొంతమంది మెగా అభిమానం అంటే ఇదే నా..? భయపెట్టి సారీ చెప్పించుకుంటారా..? అంటూ  ఘాటుగా కౌంటర్ వేస్తున్నారు..!!


మరింత సమాచారం తెలుసుకోండి: