ఏంటి ఆ హీరో పీకలదాకా తాగి శివాలయానికి వెళ్లారా..ఎవరైనా మందు తాగి దేవుడి గుడిలోకి వెళ్తారా.. ఇది ఎక్కడైనా ఉందా.. హిందువులకు తెలిస్తే ఆ హీరోని పట్టుకొని పిచ్చ కొట్టుడు కొడతారు.. మరి ఇంతకీ ఫుల్లుగా తాగి శివాలయం వెళ్లిన ఆ హీరో ఎవరయ్యా అంటే యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంగ్రీ మ్యాన్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్ ఒకప్పుడు ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు.చిరంజీవి వంటి హీరోలకు పోటీగా ఆయన సినిమాలు నిలబడ్డాయి అంటే అప్పట్లో రాజశేఖర్ క్రేజ్ ఎలా ఉండేదో చెప్పనక్కర్లేదు.అయితే అలాంటి రాజశేఖర్ కెరీర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది. ఈయన కెరియర్ విషయం పక్కన పెడితే ఈయన ఓ రోజు ఫుల్లుగా తాగి శివాలయంలోకి వెళ్లారట.

 అయితే ఈ విషయాన్ని స్వయంగా రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. నేను ఓ రోజు పీకల దాకా తాగి శివాలయంలోకి వెళ్లాను.దానికి అసలు కారణం ఓ అమ్మాయి ప్రేమ.. నేను కాలేజ్ లో చదువుతున్నప్పుడు నాకంటే వయసులో ఐదు సంవత్సరాలు పెద్దదైన అమ్మాయి వెంట పడ్డాను. కానీ ఆమె మాత్రం నన్ను కనీసం పట్టించుకోలేదు. అయితే ఈ విషయం నా ఫ్రెండ్స్ కు తెలిసి నువ్వు దేవున్ని నమ్మకపోతే నీకు ఆ దేవుడు ఏమి చేయడు రా..నీ ప్రేమ ఎప్పటికీ నిలబడదు అంటూ తాగిన మత్తులో ఉన్న నన్ను రెచ్చగొట్టారు.దాంతో వెంటనే మా ఇంటి దగ్గర ఉన్న శివాలయానికి వెళ్లి నువ్వు నిజంగా దేవుడువైతే నా లవ్ ఆ అమ్మాయిలు యాక్సెప్ట్ చేసేలా చూడు..
 లేకపోతే నువ్వు దేవుడివి కాదు రాయివని నమ్ముతాను అని శపధం చేశాను. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ అమ్మాయి నేను ఆశ్చర్యపోయేలా నా దగ్గరికి వచ్చి నాతో మాటలు కలిపి ఓ రోజు నాకు నాకు ఐ లవ్ యూ చెప్పింది. దాంతో నేను షాక్ అయ్యాను. అయితే ఆ ఆనందం ఎన్నో రోజులు లేదు. ఆ తర్వాత కొద్ది రోజులకే మా మధ్య లవ్ బ్రేకప్ అయ్యింది అంటూ రాజశేఖర్ చెప్పుకొచ్చారు. అయితే రాజశేఖర్ గతంలో మాట్లాడిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారడంతో కొంతమంది నెటిజన్లు ఈ వీడియో కింద ఫుల్లుగా తాగి శివాలయం లోకి వెళ్లాలని ఒప్పుకున్నావు హిందువులకు దొరికితే నీ పని ఇత్తడే అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: