హిందీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో మృనాల్ ఠాగూర్ ఒకరు. ఈ బ్యూటీ హిందీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్యూటీ షాహిద్ కపూర్ హీరోగా గౌతమ్ తిన్నానురి దర్శకత్వంలో రూపొందిన హిందీ జెర్సీ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించకపోయినా ఇందులో మృణాల్ తన నటనతో, అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది.

ఈమె నటించిన మొదటి తెలుగు సినిమా సీత రామం అద్భుతమైన విజయం సాధించడంతో ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె నటించిన హాయ్ నాన్న మూవీ కూడా తెలుగులో మంచి విజయం సాధించింది. ఈ బ్యూటీ ఆఖరుగా తెలుగులో ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ మాత్రం ఈ బ్యూటీ కి నిరాశను మిగిల్చింది. ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాలో మృనాల ఠాకూర్ కూడా హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే ఈమె షూటింగ్లో జాయిన్ అయినట్లు, ఆమెపై కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. కానీ ఈమె ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటనను మాత్రం విడుదల చేయలేదు. ఒక ప్రత్యేక సందర్భంలో మృనాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నట్లు మేకర్స్ చెప్పే అవకాశం చేస్తున్నట్లు, అందుకే ఇప్పటివరకు ఈ బ్యూటీ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది అని మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు అని సమాచారం. ఇప్పటివరకు అట్లీ ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను అద్భుతమైన రీతిలో ప్రమోట్ చేస్తున్నాడు. మృనాల్ ఠాకూర్   ఈ సినిమాలో నటిస్తున్న విషయాన్ని కూడా అదే రీతిలో ప్రమోట్ చేసే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మృనాల్ ఠాకూర్ కి సంబంధించిన ప్రకటనను అట్లీ ఏవిధంగా అనౌన్స్ చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: