
ముఖ్యంగా ది కిల్లింగ్ రొమాన్స్, ది కింగ్, తదితర కొరియన్ డ్రామా మూవీస్లలో కూడా నటించడమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటించి బారి పాపులారిటీ సంపాదించింది. చివరిసారిగా ఈమె నటించిన డివోర్స్ ఇన్సూరెన్స్ అనే చిత్రంలో కనిపించారు. ఇండియాలో కూడా ఈమెకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. తన మేనేజర్ ఇంస్టాగ్రామ్ లో ఇలా రాసుకుంటూ.. ఒక ప్రకాశవంతమైన అందమైన దయగల సోదరి జూన్ 20వ తేదీన ఆకాశంలో ఒక నక్షత్రంగా మారిపోయింది ఈ వార్తని తాను తీవ్ర బాధతో పంచుకుంటున్నానని వెల్లడించారు.
ఆమె కుటుంబ సభ్యుల నుంచి తాను పోస్ట్ చేస్తున్నానంటూ ప్రకటించారు.నటి లిసియోయి ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తూ ఉండేది అలాగే ఈమె హాంకుక్ యూనివర్సిటీ ఆఫ్ లో ఫారిన్ స్టడీస్ లో కూడా ఎన్నో అధ్యాయాలలో పనిచేసింది. 2013లో ఎంబీసీ చారిత్రక నాటకం హుర్ జాన్, ది ఒరిజినల్ స్టోరీ అనే చిత్రంతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే మొత్తానికి ఇలా చిన్న వయసులోనే నటి లిసియోయి మరణించిన వార్తను మాత్రం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి కుటుంబ సభ్యులు ఆమె మరణానికి గల కారణాలను వివరిస్తారేమో చూడాలి మరి.