మహేష్ బాబు,నమ్రత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆదర్శవంతమైన దంపతులుగా పేరు తెచ్చుకున్నారు.. అయితే అలాంటి జంటను డబ్బు కోసం ఏమైనా చేస్తారు అంటూ ఓ డైరెక్టర్ షాకింగ్ కామెంట్లు చేశారు. మరి ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు.. పవన్ కళ్యాణ్ తో పోలుస్తూ వీరిని ఎందుకు అవమానించారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నటీనటులు సినిమాలు చేసి హిట్ అయితే వారికి ప్రమోషన్స్ యాడ్స్ అంటూ ఎన్నో సంస్థలు వాళ్ల దగ్గరికి వస్తాయి. కొంతమంది సెలబ్రిటీలు కొన్ని ప్రోడక్ట్లకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటారు. అలా యాడ్స్ ప్రమోషన్స్ ద్వారా కోట్లు సంపాదిస్తారు. అలాంటివారిలో మహేష్ బాబు ఒకరు అని చెప్పుకోవచ్చు. ఈయన ఇండస్ట్రీలో ఎక్కువగా యాడ్స్ చేసే హీరోగా పేరు తెచ్చుకున్నారు. అయితే అలాంటి మహేష్ బాబు యాడ్స్ గురించి తాజాగా డైరెక్టర్ గీతాకృష్ణ మాట్లాడుతూ.. మహేష్ బాబు నమ్రత డబ్బు విషయంలో చాలా కమర్షియల్ ఆలోచిస్తారు. 

ఇండస్ట్రీలో ఎక్కువగా యాడ్స్ చేసే హీరోలలో మహేష్ బాబుని ముందుగా చెప్పుకోవచ్చు. డబ్బు విషయంలో ఎలాంటి పని అయినా చేస్తారు వీళ్లకు డబ్బే ముఖ్యం.. మహేష్ బాబు ఒక సినిమా చేస్తున్నాడు అంటే ఆ తర్వాత మూడు నాలుగు పెద్ద యాడ్స్ ఆయనకు వస్తాయి.అందుకే ఆయన చేసే సినిమాల్లో ఒక్క సినిమా హిట్ అయినా అంతకంటే ఎక్కువ యాడ్స్ వస్తాయి.. ఇక పవన్ కళ్యాణ్ తలుచుకుంటే వీళ్ళ కంటే ఎక్కువ సంపాదించవచ్చు. కానీ ఆయన ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూడరు. అందుకే చాలా మంది సెలబ్రిటీలు సినిమాలు హిట్ అయ్యాక కొన్ని ప్రోడక్ట్లను ప్రమోట్ చేయమంటే మేము వాడని ప్రజలకు హాని కలిగించే వాటిని మేము ప్రమోట్ చేయము అని కరాఖండిగా చెప్పేస్తారు. అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. వాళ్లకు అది యూజ్ అయ్యి లాభం చేకూరుస్తుంది అంటేనే దాన్ని ప్రమోట్ చేస్తారు.

ప్రజలకు నష్టాలు కలిగించే దేన్నీ కూడా సాయి పల్లవి, కమల్ హాసన్, చిరంజీవి,పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు ప్రమోట్ చేయరు.కానీ మహేష్ బాబు అలా కాదు డబ్బు కోసం ఏదైనా చేస్తారు.అందుకే రాజమౌళి సినిమా మూడు సంవత్సరాల షూటింగ్ అయినా కూడా ఒప్పుకున్నారు.ఎందుకంటే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రేంజ్ మరింత పెరుగుతుంది. దాంతో మరిన్ని యాడ్స్ వస్తాయి.మహేష్ బాబు ఇలా కమర్షియల్ గా ఆలోచిస్తారు కాబట్టే ఆయన ఒక సినిమా హిట్ అయితే 20,30 కోట్ల యాడ్స్ వస్తాయి. అయితే పవన్ కళ్యాణ్ తలుచుకుంటే అంతకు నాలుగు రెట్లు ఎక్కువ సంపాదించగలరు. కానీ ఆయన మొహం మీదే ఇలాంటి ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయనని చెప్పేస్తారు. డబ్బు తీసుకోకుండా చేనేత వస్త్రాలు వంటి వాటిని ఫ్రీగా ప్రమోట్ చేస్తానని చెబుతారు..అంటూ డైరెక్టర్ గీత కృష్ణ మహేష్ బాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి: