సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు. కానీ చాలా శాతం హీరోయిన్లు ఒక భాషలో మంచి సక్సెస్ను అందుకున్నాక ఆ భాషలో సినిమాలు చేస్తూ మరో భాషలో కూడా మంచి అవకాశాలను దక్కించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఓ నటి మాత్రం ఓ భాషలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఆ భాషలో మరో సినిమా చేయకుండానే ఇతర భాష సినిమాల్లో నటించడం , మరో భాషలో ఈమెకు ఫ్లాప్ వచ్చాక ఇంకో భాష సినిమాలో నటించి అక్కడ హిట్ కొట్టడం జరిగింది. ఇంతకు ఆమె ఎవరు అనుకుంటున్నారా ..? ఆ బ్యూటీ మరెవరో కాదు శ్రీనిధి శెట్టి. ఈమె మోడలింగ్ రంగం నుండి సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈమె కన్నడ సినిమా అయినటువంటి కేజిఎఫ్ సినిమాతో వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈమెకు ఇండియా వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఈమె కన్నడలో పలు సినిమాలు చేస్తుంది అని చాలా మంది భావించారు. కానీ ఈమె విక్రమ్ హీరోగా రూపొందిన తమిళ సినిమా "కోబ్రా"లో హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత ఈమె కన్నడ సినిమాలో కానీ తమిళ్ సినిమాలో కానీ నటిస్తోంది అని చాలా మంది అనుకున్నారు. 

కానీ ఈమె ఆ తర్వాత అనూహ్యంగా తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా తెలుగులో హిట్ ది థర్డ్ కేస్ మూవీ లో నటించి మంచి విజయాన్ని కూడా అందుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తెలుసు కదా అనే మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. ఇలా ఇప్పటివరకు ఈమె మూడు భాషల్లో మూడు సినిమాల్లో నటించింది. కానీ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: