తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన నటులలో నాగ చైతన్య ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా సినిమాల్లో హీరోగా నటించి ఎన్నో విజయాలను అందుకున్నాడు. చైతన్య ఓ వైపు క్లాస్ ప్లస్ రొమాంటిక్ ఏంటర్టైనర్ మూవీలలో నటిస్తూనే మరో వైపు మాస్ ఎంటర్టైనర్ మూవీలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. చైతన్య ఆఖరుగా తండెల్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా... చందు మండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. కొంత కాలం క్రితం విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది.

ఈ మూవీలోని నటనకు గాను చైతన్య కు మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే తాజాగా చైతన్య , రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఓ టాక్ షో కు గెస్ట్ గా వెళ్లారు. ఆ టాక్ షో లో భాగంగా చైతన్యహీరోయిన్ గురించి ఆసక్తికరమైన వివరాలను తెలియజేశాడు. తాజా టాక్ షో లో భాగంగా చైతన్య మాట్లాడుతూ ... నాకు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ఓ హీరోయిన్ అంటే వణుకు  పుడుతుంది. ఆమెతో నటించాలి అన్న , ఆమెతో డాన్స్ చేయాలి అన్న భయం వేస్తుంది. అంతలా నన్ను భయపెట్టిన ఆ హీరోయిన్ మరెవరో కాదు సాయి పల్లవి. నేను సాయి పల్లవి కలిసి లవ్ స్టోరీ , తండెల్ అనే రెండు సినిమాల్లో నటించాం. ఆ రెండు సినిమాల్లో కూడా తనతో డాన్స్ చేయడం , నటించడం అంటే వరకు పుట్టింది అని ఆయన చెప్పాడు.

అలాగే నాగ చైతన్య , రానా తో నువ్వు కూడా సాయి పల్లవి తో ఓ సినిమా చేశావు. కానీ ఆ సినిమాలో నీకు , సాయి పల్లవి కి మధ్య డ్యాన్స్ లేదు. నువ్వు సేపు అయ్యావు అని అన్నాడు. ఆ అనంతరం నాగ చైతన్య , సాయి పల్లవి కి ఫోన్ చేసి ఆటపట్టించారు. సెట్ లో దర్శకుడి ని కూడా సాయి పల్లవి  టార్చర్ చేస్తుంది అంటూ ఆమెను ఆటపట్టించారు రానా, నాగ చైతన్య. ఇలా తాజాగా సరదాగా చైతన్య , రానా , సాయి పల్లవి గురించి చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nc