
ఇప్పటికే లాక్ అయిన లైనప్‌ను పక్కన పెట్టి మరి అట్లీతో సినిమా చేస్తున్నాడు .. అయితే ఈ విషయంలో ఎక్కువ టైం వేస్ట్ కావడంతో మరోసారి బన్నీ కెరియర్ లో భారీ గ్యాప్ తప్పేలా లేదు .. అల్లు అర్జున్ తో సినిమాని గ్లోబల్ రేంజ్ లో భారీగా ప్లాన్ చేస్తున్నారు అట్లీ .. మేకింగ్ , టేకింగ్ పరంగా హాలీవుడ్ స్టాండర్డ్స్ ఉండేలా అన్నిట్లోనూ జాగ్రత్తగా చూసుకుంటున్నారు .. ఈ రేంజ్ సినిమా అంటే షూటింగ్ కే ఏడాది సమయం పడుతుంది .. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కు మరో ఆరు నెలలు అంటే మరో ఏడాదిన్నర వరకు బన్నీని వెండితెర పై చూసే అవకాశం లేదు . అలాగే రాజమౌళి తో సినిమా చేస్తున్న మహేష్ మళ్లీ వెండి తెర మీద చూసేది ఎప్పుడు అన్నది ఎవరు ఊహించలేకపోతున్నారు ..
ఇప్పటికే మహేష్ మూవీ రిలీజ్ అయ్యి సంవత్సరం దాటిపోయింది .. మరో రెండేళ్ల వరకు మహేష్ నుంచి కనీసం అప్డేట్ కూడా వచ్చే ఛాన్స్ లేదు అంటున్నారు టాలీవుడ్ వర్గాలు . అయితే మూడు నాలుగు సినిమాలు సెట్స్ మీద పెట్టి వీలైనంత త్వరగా సినిమాలను కంప్లీట్ చేయాలని చూస్తున్న ప్రభాస్ కూడా ఈ గ్యాప్ ను తప్పించుకోలేకపోతున్నాడు .. అన్ని అనుకున్నట్టు జరిగితే ది రాజాసాబ్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాలి .. కానీ ఆ సినిమా డిసెంబర్ కు వాయిదా పడింది .. షూటింగ్ దశలో ఉన్న ఫౌజీ పరిస్థితి ఏంటో తెలియదు .. ఇక దీంతో ప్రభాస్ కెరియర్ లో మరో ల్యాంగ్ గా తప్పేలా కనిపించడం లేదు ..