సినీ సెలబ్రిటీలు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఈ మధ్యకాలంలో మాట్లాడే మాటలకు హద్దు అదుపూ లేకుండా పోతుంది. వాళ్లు మాట్లాడే మాటలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారానికి తెరలేపుతున్నాయి.అయితే తాజాగా పవన్ కళ్యాణ్ హీరోయిన్ కూడా తన కొడుకును అడగకూడని ఒక ప్రశ్న అడిగింది.ఈ ప్రశ్నపై చాలామంది నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..కొడుకుని ఏం ప్రశ్న అడిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ మూవీలో కెవ్వు కేక అనే ఐటెం సాంగ్ తో టాలీవుడ్ లో ఫేమస్ అయిపోయింది బాలీవుడ్ నటి మలైకా అరోరా.. ఇక బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా అంటే తెలియని వారు ఎవరు ఉండరు. సల్మాన్ ఖాన్ తమ్ముడు మాజీ భార్యనే మలైకా అరోరా.. అర్బాజ్ ఖాన్ కి విడాకులు ఇచ్చాక తనకంటే వయసులో చాలా చిన్నవాడు అయినటువంటి అర్జున్ కపూర్ అంటే బోనికపూర్ మొదటి భార్య కొడుకుతో చాలా సంవత్సరాలు డేటింగ్ చేసింది.

అయితే రీసెంట్ గా వారిద్దరి లివింగ్ రిలేషన్ కి పులిస్టాప్ పడింది. ఇక మలైకా అరోరా తన బోల్డ్ పనులతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటుంది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తన కొడుకు అర్హాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్న లైవ్ పాడ్ కాస్ట్ లో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేసింది.అయితే ఇప్పటికే అర్హాన్ ఖాన్ డంబ్ బిర్యానీ అనే పేరుతో ఓ పాడ్ కాస్ట్ నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ పాడ్ కాస్ట్ లో ఇప్పటికే మలైకా అరోరా మాజీ భర్త అర్బాజ్ ఖాన్, అర్హాన్ ఖాన్ బాబాయ్ సోహెల్ ఖాన్లు వచ్చారు. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో అర్హాన్ ఖాన్ తల్లి మలైకా అరోరా ఈ పాడ్ కాస్ట్ షోకి వచ్చింది. ఇక ఇందులో భాగంగా మలైకా ఆరోరా అర్హాన్ ఖాన్ లు ట్రుత్ ఆర్ స్పైసి గేమ్ లో పాల్గొన్నారు. అయితే ఈ గేమ్ లో తల్లి కొడుకులు ఇద్దరు ఒకరినొకరు కొన్ని ప్రశ్నలు వేసుకున్నారు.

అయితే మలైకా అరోరా వంతు వచ్చినప్పుడు ఆమె తన కొడుకుని సిగ్గు లేకుండా నువ్వు ఇప్పటి వరకు ఎంత మందితో సెక్స్ చేశావు అంటూ బాడీ కౌంట్ గురించి బహిరంగంగానే మాట్లాడింది. అయితే తల్లి అడిగిన ప్రశ్నకి అర్హాన్ ఖాన్ చాలా తెలివిగా తప్పించుకొని స్పైసీ అని ఆ ప్రశ్నను దాటవేశారు. అయితే దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట దుమారం సృష్టిస్తోంది.ఈ ప్రోమో చూసిన చాలామంది ఒక తల్లి కొడుకును అడగాల్సిన ప్రశ్ననేనా ఇది.. నీ కొడుకు తిరిగి నిన్ను అలాంటి ప్రశ్న అడిగితే నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావ్..సిగ్గు లేకుండా లైవ్ షో లో ఇలాంటి ప్రశ్నలు అడుగుతావా.. అది కూడా కన్న కొడుకుని అంటూ మలైకా అరోరా పై దుమ్మెత్తి పోస్తున్నారు.. అయితే సెలబ్రిటీలు ఇలాంటి మాటలు మాట్లాడుకోవడం చాలా కామన్. వీటిని ఎవరు అంత సీరియస్ గా తీసుకోరు ఇలాంటివి ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: