
2017 లో తాను ఒక ప్రాపర్టీని కొన్నానని అందులో ఒక మైనర్ వాటాదారుడు కూడా ఆ ప్రాపర్టీని కొన్నారు.. అయితే అలా కొన్న తర్వాత అతడి మీద ఈడి ప్రాబ్లం ఉన్నట్లు తెలిసింది.. కాని అతని మీద అలాంటి ఇబ్బంది ఉన్నట్టు నాకు ముందు తెలియదంటు తెలిపారు అల్లు అరవింద్. అతను బ్యాంకు లోను తీసుకొని మరి ఎగ్గొట్టారని తెలిసిందని వెల్లడించారు. దీంతో అప్పటినుంచి అతడి మీద ఈడి అధికారుల నిఘా ఉందని వెల్లడించారు. ఈడి దగ్గర ఉన్న బుక్ ఆఫ్ అకౌంట్స్ తన పేరు ఉన్నదని అందుకే అధికారులు తనని విచారణకు పిలిపించాలని వెల్లడించారు అల్లు అరవింద్.
కేవలం ఒక బాధ్యత గల పౌరుడిగానే తాను వెళ్లానని వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలిపారని అంతేతప్ప ఇంకేమీ లేదు మీడియా వాళ్ళు కావాలనే ఈ విషయాన్ని చాలా పెద్దదిగా చేసి మరి చూపిస్తున్నారంటూ వెల్లడించారు. ఈడి అధికారులు ఎంక్వయిరీకి పిలిస్తే మాత్రమే వెళ్లాను అంతకుమించి ఏమీ లేదంటూ వెల్లడించారు. దీంతో తన మీద వస్తున్న రూమర్లకు కొంతమేరకు చెక్ పడిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అల్లు అరవింద్ వర్సెస్ సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నారు. ఈడి అధికారుల విషయంపై క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు కొంతమేరకు ఊపిరి పీల్చుకున్నారు.