
మరీ ముఖ్యంగా రష్మిక మందన్నా లెవెల్ - క్రేజ్ రెండు మారిపోయాయి . ఇలాంటి సమయంలోనే ఆమెకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉండడం అభిమానులకి భయం పుట్టిస్తుంది. రష్మిక మందన్నాకి పుష్ప సినిమాలో నటించినప్పటి నుంచి షోల్డర్ పెయిన్ ఎక్కువగా వచ్చింది అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చిందట. అంతేకాదు అప్పట్లో ఓ డాక్టర్ కూడా రష్మిక తన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంది అంటూ సామీ సామీ అంటూ స్టెప్ వేయడం ఆపాలి అంటూ నాటిగా కామెంట్స్ చేశారు .
అయితే ఆ తర్వాత చాలామంది కూడా ఏ స్టేజ్ ఎక్కిన సరే నువ్వు సామి సామి అంటూ చేతులు గిరి గిరా తిప్పేస్తూ ఉంటే చేతులు పట్టేస్తాయంటూ కౌంటర్స్ వేశారు . అది నిజమైందో ఏమో రష్మిక మందనాకి షోల్డర్ పెయిన్ ఎక్కువగా ఉందట. ఒక మైల్డ్ సర్జరీ చేయించుకోవాలి అంటూ డాక్టర్ సజెస్ట్ చేశారట . దానికోసం ఫారిన్ కంట్రీస్ కి వెళ్లబోతుందట . ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అయితే ఈ వార్తపై రష్మిక కానీ రష్మిక టీం కానీ రష్మిక కుటుంబ సభ్యులు కానీ స్పందించలేదు . హీరోయిన్ రష్మిక సర్జరీ చేయించుకోబోతుంది అన్న వార్త తెలిసి అభిమానులు షాక్ అయిపోతున్నారు ..భయపడిపోతున్నారు . ఇది ఫేక్ వార్తనా..? లేకపోతే నిజంగా నిజమైన వార్త నా..? రష్మిక టీమ్ స్పందిస్తే బాగుంటుంది అంటున్నారు అభిమానులు . చూడాలి మరి రష్మిక స్పందిస్తుందో లేదో..??