
నితీష్ తివారి డైరెక్షన్లో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న రామాయణంలో శోభన ఒక కీలకమైన పాత్రను చేయబోతున్నట్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో రావణుడి తల్లి పాత్ర కైకాసి పాత్రను చేయబోతున్నట్లు బాలీవుడ్ వర్గాలలో వినిపిస్తున్నాయి. రావణుడు, శూర్పనక, కుంభకర్ణుడు, విభీషణుడును కన్నది కైకేయి ఇలాంటి పాత్రలో నటించడం చాలా ఆనందంగా ఉంది అంటూ శోభన తన సోషల్ మీడియా ద్వారా రామాయణం సంబంధించి గ్లింప్స్ షేర్ చేస్తే తన ఆనందాన్ని వెల్లడించింది శోభన.
ఎన్నో తరాల నుంచి తీర్చిదిద్దిన కథలో భాగం కావడం చాలా గౌరవంగా ఉన్నదని.. రాముడు వర్సెస్ రావణుడి కథ ప్రపంచంలోకి స్వాగతం ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ రుణపడి ఉంటాను అంటూ తన ఆనందాన్ని తెలియజేస్తూ రాసుకొచ్చింది శోభన.. రామాయణం సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా నటించగా సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. రావణుడి పాత్రలో యశ్ నటిస్తూ ఉన్నారు. ఇటీవలే విడుదలైన చిన్న టీజర్ కూడా అందరిని ఆశ్చర్యపరిచేలా కనిపించింది. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ వర్క్ తోనే అద్భుతంగా ఆకట్టుకున్నట్టుగా ఈ టీజర్ కనిపిస్తోంది. మరి కల్కి సినిమా తర్వాత ఎక్కువగా శోభన క్రేజ్ పెరిగిపోయి పలు రకాల పాత్రలు వస్తున్నాయి. మరి రామాయణ సినిమా తర్వాత మరిన్ని అవకాశాలను అందుకుంటుందేమో చూడాలి శోభన.