
అయితే బాలీవుడ్ లో దంగల్ లాంటి పాన్ వరల్డ్ హిట్ సినిమాని తీసిన నితీష్ తివారి దేశంలోనే ప్రముఖ డైరెక్టర్ లో ఒకరు .. అలాగే అతనితో సినిమా చేసేందుకు ఏ హీరో అయినా అసలు నో చెప్పడు .. కానీ రాజమౌళితో అవకాశం కోసం మహేష్ అతనికి నో చెప్పినట్టు తెలుస్తుంది .. అయితే దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు భారతదేశంలోనే నెంబర్ వన్ డైరెక్టర్గా కొనసాగుతున్నాడు .. పాన్ ఇండియా మార్కెట్లో అతన్ని తొక్కే వారు లేరు .. త్రిబుల్ ఆర్ తో ఆస్కార్ ను భారతదేశానికి అందించి ప్రపంచ సినీ ప్రముఖుల దృష్టిని తనపైకు తిప్పుకున్నాడు . ఇలా రాజమౌళి మార్కెట్ ఇప్పుడు పాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళింది .. రాజమౌళి తెరకెక్కించే సినిమాలు ఇకపై 1000కోట్ల రేంజ్ నుంచి 2000 కోట్లు అంతకుమించి వసూళ్ల దిశగా అడుగులు వేస్తున్నాయి .. ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను సులువుగా రాబట్టుకుంటున్నాయి .. కచ్చితంగా మాస్ ప్రేక్షకులను థియేటర్లకి రప్పించగల దీరుడు .. దీని కారణంగా అతని ముందు మరొక దర్శకుడు నిలబెట్టడం పోల్చడం అనేది ఎంతో కష్టం .. అందుకే ఎలాంటి మొహమాటం లేకుండా మహేష్ మొదటి ఆప్షన్ రాజమౌళిని ఎంచుకున్నాడు .
అయితే మహేష్ నో చెప్పిన నితీష్ తివారి రెండు ఆప్షన్ గా రణబీర్ కపూర్ ని రాముడు క్యారెక్టర్ కోసం తీసుకున్నాడు .. ఇదే క్రమంలో రాముడిగా రణబీర్ ఎంపిక సరికాదని బాలీవుడ్ ప్రముఖ సీనియర్ యాక్టర్స్ కొందరు విమర్శలు చేసిన విషయం తెలిసిందే .. కానీ నీతిష్‌కి ఉన్న ఏకే ఆప్షన్ రణబీర్ మాత్రమే .. అందుకే అతడు అతనికి అవకాశం కల్పించి సినిమాను తెరకెక్కించాడు .. ఇటీవలే రామాయణం నుంచి తొలి టీజర్ వచ్చింది . అలాగే నితీష్ శ్రీరాముని క్యారెక్టర్ లార్జర్ దేన్ లైఫ్ రేంజ్ లో సృష్టించాడు .. ఇక మరి 2026 దీపావళి కానుకగా రామాయణం మొదటి భాగం ప్రేక్షకులు ముందుకు రానుంది .. ఇక మరి రణబీర్ , నితీష్ కాంబో రామాయణంతో ఎలాంటి సక్సెస్ చూస్తారో చూడాలి .