సినిమా ఇండస్ట్రీ లో గాసిప్స్ అనేవి చాలా సర్వసాధారణం. ఈ గాసిప్స్ అనేవి ఇప్పుడు పుట్టినవి కావు. ఎన్నో సంవత్సరాల నుండి వైరల్ అవుతున్నవే. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం భారీగా పెరగడంతో ఏదైనా గాసిప్ స్టార్ట్ అయ్యింది అంటే అది నిమిషాల్లో దేశ వ్యాప్తంగా , ప్రపంచ వ్యాప్తంగా స్ప్రెడ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే ఒక హీరో మరియు హీరోయిన్ కలిసి రెండు సినిమాల్లో నటించిన అంతకంటే ఎక్కువ సినిమాల్లో నటించిన వారిపై గాసిప్స్ రావడం సర్వసాధారణం. అలాగే ఓ దర్శకుడు ఓకే హీరోయిన్ తో పలు మార్లు సినిమా చేసిన అలాంటి వారిపై గాసిప్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన ఓ నటుడు మరియు నటిపై చాలా రోజుల నుండి గాసిప్స్ వస్తున్నాయి. ఇకపోతే ఆ గాసిప్స్ కి వారు కూడా బలం ఇచ్చేలా కొన్ని సంఘటనలు కూడా జరిగాయి. అలా గాసిప్స్ ను తీవ్రంగా ఎదుర్కొంటున్న టాలీవుడ్ నటుడు మరియు నటి ఎవరు అనుకుంటున్నారా ..? మరి వారెవరో కాదు విజయ్ దేవరకొండ , రష్మిక మందన. విజయ్ , రష్మిక కాంబోలో మొదటగా గీత గోవిందం అనే సినిమా వచ్చింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత వీరి కాంబోలో డియర్ కామ్రేడ్ అనే సినిమా వచ్చింది. ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇక డియర్ కామ్రేడ్ సినిమా సమయం నుండే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అనే వార్తలు రావడం మొదలు అయింది. 

ఆ తర్వాత వీరు అనేక ప్రాంతాలలో కలిసి ఉన్నారు అని కూడా అనేక వార్తలు వచ్చాయి. ఈ మధ్య కాలంలో వీరిద్దరూ ఒకే కారులో ఎయిర్పోర్ట్  కి రావడం జరిగింది. దానితో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక సోషల్ మీడియాలో కూడా ఒకరి పోస్టుకు మరొకరు రిప్లై ఇవ్వడం కూడా జరుగుతూ వస్తుంది. దానితో ఆ గాసిప్స్ మరింత బలపడుతున్నాయి. మరి వీరి విషయం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd