ఏంటి ఈ పవన్ కళ్యాణ్ హీరోయిన్ 64 ఏళ్ల హీరోకి భార్య కాబోతుందా..ఆమెకి మైండ్ ఏమైనా దొబ్బిందా.. రియల్ గానే ఇలాంటి నిర్ణయం తీసుకుందా..ఎందుకు ముదురు హీరోకి భార్య కాబోతోంది..ఆమె పెళ్లి చేసుకోవడానికి ఎవరు దొరకలేదా అంటూ ఈ విషయం తెలిసిన చాలామంది నెటిజన్లు ఆ హీరోయిన్ ని ఏకీపారేస్తున్నారు. మరి ఇంతకీ 64 ఏళ్ల హీరోకి భార్య కాబోతోంది అంటూ వార్తల్లో ఉన్న  ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే నిధి అగర్వాల్.. ఏంటి నిధి అగర్వాల్ 64 ఏళ్ల హీరోని పెళ్లి చేసుకోబోతుంది అని ఈ విషయం తెలిసిన చాలామంది నోరెళ్లబెడతారు.అయితే 64 ఏళ్ల హీరోని పెళ్లి చేసుకోబోతుంది నిజమే కానీ అది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో.. 

ఇక విషయంలోకి వెళ్తే.. త్రివిక్రమ్ డైరెక్షన్ లో ప్రస్తుతం వెంకటేష్సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాకి రమణ కేరాఫ్ ఆనంద నిలయం అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట.అందులో ఒక హీరోయిన్ గా నిధి అగర్వాల్ ని తీసుకోబోతున్నట్టు టాలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో 64 ఏళ్ల వెంకటేష్ కి భార్యగా నిధి అగర్వాల్ నటించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ న్యూస్ వైరల్ గా మారడంతో చాలామంది నిధి అగర్వాల్ ఫ్యాన్స్ నీకేమైనా మైండ్ దొబ్బిందా..

64 ఏళ్ల హీరోకి భార్య పాత్రలో నటించడం ఏంటి అంటూ ఏకీపారేస్తున్నారు. హీరోల ఏజ్ జస్ట్ నెంబర్ మాత్రమే. ఆయన 64 ఏళ్ల హీరోలా ఏ మూలనైనా కనిపిస్తున్నాడా..అయినా 28 ఏళ్ల  మీనాక్షి చౌదరి వెంకటేష్ కి లవర్ గా నటించినప్పుడు 31 ఏళ్ల నిధి అగర్వాల్ వెంకటేష్ కి భార్యగా నటిస్తే తప్పేముంది అంటూ చాలామంది నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికి వెంకటేష్ మూవీ లో నిధి అగర్వాల్ నటించబోతుంది అంటూ వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తేనే ఈ విషయం బయట పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: