"నాగచైతన్య".. ఈ మధ్యకాలంలో బాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పేరు . ఒకప్పుడు హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకుని వాడుకొని వదిలేసాడు అనే కామెంట్స్ దక్కించుకున్న నాగచైతన్య ఇప్పుడు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ హీరోగా నిలదొక్కుకోవడానికి కష్టపడుతున్నాడు అనే కామెంట్స్ దక్కించుకునేంత  స్థాయికి ఎదిగిపోయాడు . ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్గా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నాగచైతన్య . హీరోయిన్ శోభిత ధూళిపాళ్లని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరు అంతకుముందు డేటింగ్ లో ఉన్నారు అని .. ఆ తర్వాత ఇంట్లో వాళ్లకు చెప్పి పెళ్లి చేసుకున్నారు అన్నట్టు ఎప్పటినుంచో టాక్ వినిపిస్తుంది .


గతంలో చాలా సార్లు పెళ్లికి ముందే వీళ్ళ ఫొటోస్ సోషల్ మీడియాలో లీకై వైరల్ అయ్యాయి.  కానీ ఆ సమయంలో మాత్రం వీళ్ళు ఏ విధంగా స్పందించలేదు.  కానీ సడన్గా పెళ్లి చేసుకుంటున్నామంటూ నిశ్చితార్థపు పిక్స్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అయ్యింది ఈ జంట.  ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహం వద్ద పెళ్లి చేసుకొని అందరి ఆశీర్వాదాలు తీసుకున్నారు  ఈ జంట. ఫ్యామిలీ లైఫ్ ను చాలా పీస్ ఫుల్ గా తీసుకెళ్తున్న నాగచైతన్య స్వీట్ మూమెంట్ ని తన ఫోన్లో సెల్ఫీగా తీసుకున్నాడు .



ఇందుకు సంబంధించిన పిక్చర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. తన భార్య శోభిత ధూళిపాలతో విమానంలో జాలీగా గడపడానికి ఓ స్పెషల్ ప్లేస్ కి వెళ్తున్నారు.  అదే మూమెంట్లో ఆ స్పెషల్ మూమెంట్ ఎప్పటికీ గుర్తుండేలా ..  తనకి ఎంతో స్పెషల్ అయినా శోభిత ధూళిపాళ్లతో విమానంలో సెల్ఫీ తీసుకున్నారు . ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇందులో నాగ చైతన్య లైట్ బ్లూ కలర్ టీషర్ట్ వేసుకోగా శోభిత బ్లాక్ షర్ట్ వేసుకొని చాలా ఆకర్షణీయంగా ట్రెండీగా కనిపించారు . ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది.  అక్కినేని క్యూట్ కపుల్ అంటూ ఫాన్స్ ఓ రేంజ్ లో కామెంట్స్ పెడుతున్నారు.  నాగచైతన్య రీసెంట్ గా "తండేల్" సినిమాతో సూపర్ డూపర్ హిట్టు అందుకున్నాడు . ఇప్పుడు తన 24వ సినిమా కోసం బిజీ బిజీగా గడిపేస్తున్నాడు . చిన్న గ్యాప్ రావడంతో శోభిత ధూళిపాళ్లతో వెకేషన్ ఎంజాయ్ చేయడానికి తన ఫేవరెట్ ప్లేస్ కి వెళ్ళినట్లు తెలుస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: