కన్నడ హీరోయిన్స్ ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. అలా క్రేజ్ సంపాదించిన వారిలో రుక్మిణి వసంత్ కూడా ఒకరు. సప్త సాగరాలు దాటి అనే చిత్రంతో సౌత్ లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ చిత్రంలో కూడా నటిస్తున్నది. ఈ సినిమాలో అవకాశం అందుకోవడంతో తెలుగులో కూడా ఈ అమ్మడికి అవకాశాలు భారీగానే క్యూపడుతున్నాయి. ఇప్పటికే రెండు మూడు చిత్రాలు కూడా ఈమెకు ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ఇప్పుడు తాజాగా డైరెక్టర్ సుకుమార్ కూడా రుక్మిణి వసంత వైపే ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.


పుష్ప 2 సినిమా అనంతరం సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని రామ్ చరణ్ తో చేయబోతున్నారు.ఈ చిత్రాన్ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రాబోతున్న పెద్ది చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా పైన కూడా అంచనాలు భారీగానే పెరిగిపోయాయి.. అలాగే సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో గతంలో రంగస్థలం సినిమా వచ్చి రామ్ చరణ్ కెరీర్ కి ఒక మైలురాయిగా నిలిచింది


ఇప్పుడు మళ్లీ అలాంటి కాంబినేషన్ సెట్ కావడంతో అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ ఇంకా ఫీలవుతున్నారు. ఇందులో రామ్ చరణ్ కి జోడిగా రుక్మిణి వసంత్ ని ఎంపిక చేసుకోవాలని సుకుమార్ ఆలోచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సప్త సాగరాలు దాటి అనే సినిమాతో తెలుగులో కూడా బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది రుక్మిణి. ఇందులో ఈమె నటను చూసి చాలామంది ఫిదా అయ్యారు. అంతేకాకుండా ఎన్టీఆర్ సినిమాలో నటించడంతో మరింత ప్లస్ అవుతుంది. మరి సుకుమార్ డైరెక్షన్ లో సినిమా విషయంపై కన్ఫర్మ్ అయితే మాత్రం రుక్మిణి కెరియర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. మరి చిత్ర బృందం అఫీషియల్ గా ఎవరిని ప్రకటిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: