
ఈతరం హీరోలకి హీరోయిన్లకి ఈ పేరు పెద్దగా గుర్తు ఉండకపోవచ్చు . కానీ ఒకప్పుడు మాత్రం ఈ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయింది. అప్పట్లో అమ్మాయిలు కాలేజీకి చదువుకోడానికి వెళ్లేటప్పుడు బుక్స్ లలో వడ్డే నవీన్ నటించిన సినిమా పోస్టర్ల ఫోటోలు కట్ చేసుకుని మరి పెట్టుకొని ఆయనను అభిమానించి ఆరాధించే వాళ్ళు ఉన్నారు అంటే ఆయన నటన ఎంత బాగుంటుంది .. ఆయన ఎంత క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అన్న విషయం అర్థం చేసుకోవచ్చు . . అయితే సడన్గా సినిమా ఇండస్ట్రీ నుంచి దూరమైన వడ్డే నవీన్ ఇప్పుడు మరొకసారి సినిమాలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు . అయితే ఆయన హీరో గా రీ ఎంట్రీ ఇవ్వడం లేదు నిర్మాణ సంస్థ ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతున్నాడు.
ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది . నవీన్ గురించి ఈ మధ్యకాలంలో చాలా వార్తలు వినిపించాయి. ఆయన సీనియర్ హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నారు అని ఒకసారి.. ఆయన విలన్ గా రి ఎంట్రీ ఇస్తున్నారు అని మరోసారి .. రకరకాలుగా వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అయితే నవీన్ రీ ఎంట్రీ కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వడ్డే నవీన్ "వడ్డే క్రియేషన్స్" అనే పేరుతో ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించారు అంటూ తెలుస్తుంది. దీంతో నిర్మాతగా ఆయన రీఎంట్రీ ఇస్తున్నారు అంటూ ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నాడు. నటుడుగా తిరిగి వస్తారు అంటూ వార్తలు వచ్చినప్పటికీ ఆయన మాత్రం నిర్మాతగానే ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నారట . ఇప్పటికే చాలామంది హీరోస్ ఒకపక్క సినిమాలు చేసుకుంటూనే మరొకవైపు సినిమాలను నిర్మిస్తున్నారు . అయితే వడ్డే నవీన్ మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీలోకి సరికొత్తగా నిర్మాణ సంస్థ తీసుకొచ్చి కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేసే విధంగా సినిమాలని నిర్మించబోతున్నారట . చూడాలి మరి నిర్మాతగా ఆయన ఎంత సక్సెస్ అవుతాడు అనేది..!???