ఒకప్పుడు టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో పూరి జగన్నాథ్ ఒకరు. ఈయనతో కలిసి వర్క్ చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఎంతో ఇంట్రెస్ట్ చూపించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వరస పరాజయాలు పలకరించడంతో పూరి జగన్నాథ్ తో సినిమా అంటే ముఖం చాటేస్తున్న హీరోలే ఎక్కువగా ఉన్నారు. దాంతో `లైగ‌ర్‌` వంటి బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ అనంత‌రం పూరి పక్క భాషా హీరోలను నమ్ముకున్నారు. ఇటీవ‌లె కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో తన తదుపరి సినిమాను ప్రారంభించారు.
ప్రొఫెషన్ గురించి పక్కన పెడితే.. పూరి జగన్నాథ్‌ 1996లో లావణ్యను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఆకాశ్‌ అనే కుమారుడుతో పాటు పవిత్ర అనే కుమార్తె ఉంది. ఆకాశ్‌ ఆల్రెడీ `మెహబూబా` మూవీతో 2018లో కథానాయకుడిగా కెరీర్ ప్రారంభించాడు. అంతకుముందు చైల్డ్ ఆర్టిస్ట్ గానూ పలు సినిమాలు చేశాడు. అయితే ఆకాశ్‌ హీరోగా ఇంకా అనుకున్న‌ స్థాయిలో సక్సెస్ కాలేదు.
పవిత్ర జగన్నాథ్ విషయానికి వస్తే.. ఈ అమ్మడు చిన్న వయసులో `బుజ్జిగాడు` మూవీలో నటించింది. త్రిష చిన్న‌ప్ప‌టి క్యారెక్ట‌ర్ ను ఆమె పోషించింది. ఆ తర్వాత ఆమె వెండితెరపై పెద్దగా కనిపించలేదు. తన ఫోకస్ మొత్తాన్ని స్టడీస్ పైన పెట్టింది. ఇక ప్రస్తుతం పవిత్ర ఎలా ఉందో చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే అంత‌లా ఆమె మారిపోయింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పవిత్ర తన ఫోటోలు పంచుకుంటూ ఉంటుంది. రీసెంట్ గా కూడా పవిత్ర కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ పిక్స్ లో పవిత్ర చాలా బొద్దుగా క‌నిపించింది. కానీ ఆమె ఫేస్‌లో క్యూట్‌నెస్‌ మాత్రం ఇంకా అలానే ఉంది. దాంతో బొద్దుగా ఉన్న చాలా ముద్దుగా ఉన్నావ్ అంటూ ప‌విత్రను నెటిజ‌న్లు తెగ‌ పొగిడేస్తున్నారు.
వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: