
కోట శ్రీనివాసరావు పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చే పాత్ర ఆహనా పెళ్ళంట సినిమాలో లక్ష్మీపతి క్యారెక్టర్. ఈ పాత్ర కామెడీ టైమింగ్ డైలాగ్స్ తిరుగులేనివిగా నిలిచాయి.
వెంకటేష్ ఎన్నో చిత్రాలలో నటించారు .కోటా శ్రీనివాసరావు శత్రువు సినిమాలో రామన్న క్యారెక్టర్ కి ఫిదా అయ్యారు. జీవిత అనుభవంలో నటనలో నేర్చుకున్న మెలకువలు పాత్రలను బాగా తెలిసిన నటుడు కావడం చేత ఇలాంటి వ్యక్తిని తాను ఎప్పుడు చూడలేదని ఎన్నో సందర్భాలలో తెలిపారు వెంకటేష్.
శివ చిత్రం రాంగోపాల్ వర్మ, నాగార్జున మాత్రమే కాదు కోట శ్రీనివాసరావు కూడా తన అద్భుతమైన నటనతో గుర్తుకు చేస్తారు. తెలుగు సినిమాలకు సరికొత్త విలనిజన్ని వర్మ చూపించారు.
కోట శ్రీనివాసరావు, సౌందర్య మధ్య మంచి స్నేహబంధం ఉండేదట. అంతేకాకుండా సౌందర్య, కోట శ్రీనివాసరావు లాంటి నటుడుని ఎప్పుడు చూడలేదని అందుకే కోటా శ్రీనివాసరావు ఎక్కడ కనిపించినా కూడా పాదాభివందనం చేసేవారట.
కోట శ్రీనివాసరావు గణేష్ సినిమాలో చేసిన క్యారెక్టర్ ఎప్పటికీ మర్చిపోలేరు .
అలాగే ఇడియట్ సినిమాలో తండ్రిగా చేసిన పాత్ర ఇప్పటికీ జ్ఞాపకంగానే ఉంటుంది.
మల్లేశ్వరి సినిమాలో బావాజీగా మెప్పించారు.
రాజేంద్రప్రసాద్ నటించిన కలికిత్తురాయి, ఆ నలుగురు చిత్రాలలో కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ చాలా స్పెషల్ అని చెప్పవచ్చు.
ఇక మహేష్ బాబు నటించిన అతడు సినిమాలో కూడా బాజిరెడ్డి క్యారెక్టర్ కోటా శ్రీనివాసరావు అద్భుతంగా నటించారు. త్రివిక్రమ్ సినిమాలలో కోట శ్రీనివాసరావుకు ప్రత్యేకించి మరి పాత్రలు ఉంటాయి.
ప్రభాస్ నటించిన చత్రపతి సినిమాలో కోట శ్రీనివాసరావు రోల్ హైలెట్ గా ఉంటుంది.
బొమ్మరిల్లు చిత్రంలో తండ్రిగా చేసిన పాత్ర కూడా అద్భుతంగా ఆకట్టుకుంది. అలాగే ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలో కూడా ఆకట్టుకునేలా నటించారు. ఎన్టీఆర్ నటించిన బృందావన, పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ లో సిద్ధప్ప నాయుడు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిపాత్ర కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. ఇలాంటి నటుడు దొరకడం ఇండస్ట్రీకి ఒక అదృష్టం అని చెప్పవచ్చు. తెలుగు సినీ చరిత్రపై చెరగని ముద్ర వేసుకున్నారు కోటా శ్రీనివాసరావు.