తెలుగులో బిగ్ బాస్ టెలివిజన్ షో ప్రారంభం అయ్యి చాలా కాలమే అవుతుంది. మొదట ఇండియాలో హిందీ లో ప్రారంభం అయిన బిగ్బాస్ టెలివిజన్ షో కు అద్భుతమైన రెస్పాన్స్ దక్కడంతో ఈ షో ను అనేక ప్రాంతీయ భాషలలో కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటివరకు తెలుగులో బుల్లి తెరపై బిగ్ బాస్ 8 సీజన్లను కంప్లీట్ చేసుకోగా , ఓ టీ టీ లో ఒక సీజన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇక తెలుగు బుల్లి తెర మొదటి సీజన్ కి తారక్ హోస్ట్ గా వ్యవహరించగా , రెండవ సీజన్ కి నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఇక మూడవ సీజన్ నుండి ఎనిమిదో సీజన్ వరకి మరియు ఓ టీ టీ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు.

మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోయే తొమ్మిదవ సీజన్ కి కూడా నాగర్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే బిగ్బాస్ లో కంటెస్టెంట్ల ఎంపిక అనేది ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటుంది. బిగ్బాస్ హౌస్ లోకి ఒక హీరో , ఒక కమెడియన్ , ఒక సింగర్ , ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ , ఒక సామాన్యుడు ఇలా అనేక రకాలుగా అనేకా మందిని తీసుకుంటూ ఉంటారు. ఇకపోతే బిగ్బాస్ సీజన్ 9 లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఓ సింగర్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... లక్ష్మీ అనే జానపద సింగర్ బిగ్బాస్ 9 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 

లక్ష్మి ది నిర్మల్‌ జిల్లా ముథోల్‌ మండలం గన్నోర గ్రామం. ఈమె చిన్న స్థానం నుండి పాటలు పాడుతుంది. ఫోక్ సాంగ్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈమె సినిమా పాటలను కూడా పాడింది. ఈమె పుష్ప పార్ట్ 2 మూవీలోని ఫీలింగ్స్ సాంగ్ ను పాడి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. సింగర్ గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: