ఇప్పుడు ఇంటర్నెట్ ని "మై డియర్ మోనిక" అనే సాంగ్ ఏ రేంజ్ లో ఊపేస్తుంది అనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . లోకేష్ కనగరాజు దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన "కూలీ" సినిమాలోని స్పెషల్ సాంగ్ ఈ "మై డియర్ మొనిక". ఈ సాంగ్ గురించి అందరు  ఓ రేంజ్ లో పొగిడేస్తూ మాట్లాడుకుంటున్నారు.  ఈ సాంగ్ లో పూజ హెగ్డే తన అందాల ప్రదర్శన ఏ రేంజ్ లో చేసింది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  మరి ముఖ్యంగా క్యూట్ ..నాటి స్టెప్స్ వేస్తూ అదరహో అనిపించేసింది  .


స్పెషల్ గా మలయాళి నటుడు  సౌరబ్ షరీఫ్ ఈ పాటలో మెరవడం హైలైట్ గా మారింది.  రజినీకాంత్ ని చూపించకుండా సౌరబ్ షరీఫ్ ని ఈ పాటలో  హైలెట్ చేసి చూపించడంతో లోకేష్ కనగరాజు ఏదో బిగ్  గానే ప్లాన్ చేశాడు అంటూ కోలీవుడ్ జనాలు  మాట్లాడుకుంటున్నారు .  నిజానికి "ఈ మై డియర్ మొనిక"  అనే సాంగ్ లో లోకేష్ కనగరాజు తెలుగు హీరోయిన్  ని చూపించాలి అనుకున్నాడట.  ఆమె మరి ఎవరో కాదు హీరోయిన్ "అంజలి". కోలీవుడ్ ఇండస్ట్రీ ఆమెకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.



"మై డియర్ మొనిక" స్పెషల్ సాంగ్ లో అంజలిని చూపించాలనుకున్నారట . కానీ అంజలి ఈ పాట చేయడానికి ఒప్పుకోలేదట . ఇది స్పెషల్ సాంగ్ అని .. ఇది చేయలేను అని తెగేసి చెప్పేసిందట.  లోకేష్ కనగ రాజు  స్పెషల్గా రిక్వెస్ట్ చేసిన సరే అంజలి మాత్రం ఈ పాట చేయడానికి అస్సలు ఒప్పుకోలేదట.  నిజానికి ఈ పాట లో అంజలి అస్సలు సూట్ కాదు. లోకేష్ కనగ రాజ్ ది బ్యాడ్ టేస్ట్ అని కూడా జనాలు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత పలువురు హీరోయిన్స్ ని అప్రోచ్ అయిన వాళ్లు రిజెక్ట్ చేయడంతో ఫైనల్లీ పూజ హెగ్డే ఓకే చేసింది.  పూజ హెగ్డే గతిలేక ఈ పాట చేసింది అని అంతా అనుకున్నారు కాదు కాదు పూజ హెగ్డే ఈ పాటలు ఏదో చూసే ఓకే చేసింది అని పాట రిలీజ్ అయ్యాకే తెలిసింది . మై డియర్ మౌనిక సాంగ్ పూజ కెరియర్ లోనే ఓ స్పెషల్ పాటగా నిలిచిపోతుంది అని చెప్పడంలో సందేహమే లేదు . ఈ పాట ను బిగ్ స్క్రీన్ లో చూడడానికి ఫ్యాన్స్ వెయిటింగ్ . ఆ మూమెంట్ రావాలి అంటే ఆగస్టు 14 వరకు వెయిట్ చేయాల్సిందే..!!!

మరింత సమాచారం తెలుసుకోండి: