
ఇందులో భాగంగా నిఖిల్ ప్రస్తుతం తన దృష్టి అంతా కూడా ఎక్కువగా స్వయంభు అనే చిత్రం పైన పెట్టారు. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఒక పీరియాడికల్ సబ్జెక్టు కావడం చేత మరింత ప్రత్యేకించి దృష్టి పెట్టారు నిఖిల్. ఇందులో పోరాటయోధుడుగా కనిపించబోతున్నారు ఇందుకోసం 8 నెలల పాటు చాలా స్ట్రీట్ డైట్ ని ఫాలో అవుతూ మార్షల్ ఆర్ట్స్ , ప్రత్యేకించి గుర్రపు స్వారీ వంటివి నేర్చుకున్నారు. rrr చిత్రానికి పనిచేసిన స్టంట్ కొరియోగ్రాఫర్ దగ్గర సుమారుగా 45 రోజులపాటు ఈ ట్రైనింగ్ తీసుకున్నారట నిఖిల్.
నిఖిల్ కెరియర్ లోని ఒక భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్న స్వయంభు సినిమా షూటింగ్ ఒక్క రోజు మినహా పూర్తి అయినట్లుగా వినిపిస్తున్నాయి. హీరో రాజేంద్రప్రసాద్ డేట్ దొరకకపోవడంతో సినిమా షూటింగ్ పెండింగ్లో ఉన్నదట. అలాగే ఈ సినిమాకి సిజి, బిఎఫ్ ఎక్స్ వరకు ఎక్కువగా ఉండడంతో రిలీజ్ కి మరింత సమయం పడుతుందని చిత్ర బృందం భావిస్తోంది. ఈ చిత్రానికి డైరెక్టర్ గా భరత్ కృష్ణమాచారి వ్యవహరిస్తున్నారు. ఇందులో హీరోయిన్స్ గా సంయుక్త మీనన్, నభా నటేష్ నటిస్తూ ఉన్నారు. మరి స్వయంభు సినిమా అటు హీరోకు హీరోయిన్ కెరియర్స్ కి కీలకంగా మారుతుందేమో చూడాలి.