బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి ఆమీర్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈయనకు సరైన విజయాలు దక్కడం లేదు. ఆమీర్ ఆఖరుగా దంగల్ అనే మూవీ తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వాసులు చేసి అనేక కొత్త కొత్త రికార్డులను సృష్టించింది. ఇంత గొప్ప విజయం సాధించిన సినిమా తర్వాత ఆమీర్ ఎన్నో ప్రయోగాలను చేస్తున్న ఆయన ప్రయోగాలు బాక్సా ఫీస్ దగ్గర ఫలించడం లేదు. దంగల్ సినిమా తర్వాత ఈయన నటించిన చాలా సినిమాలు ప్రేక్షకులను నిరుత్సాహ పరిచాయి.

తాజాగా ఆమీర్ "సితారే జమీన్ పర్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి మంచి టాక్ వచ్చిన కూడా భారీ కలెక్షన్లను మాత్రం ఈ సినిమా వసూలు చేయలేకపోయింది. ఆమీర్ కి వరస ఫ్లాప్స్ వస్తూ ఉండడంతో ఆయన ఓ మాస్ మూవీ తో కం బ్యాక్ ఇస్తే బాగుంటుంది అని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఆమీర్ తన తదుపరి మూవీ ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి అట్లీ తో చేయబోతున్నాడు. సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా అట్లీ దర్శకత్వంలో తాజాగా కూలీ అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే.

మూవీ లో కూడా ఆమీర్ ఓ చిన్న క్యామియో పాత్రలో కనిపించబోతున్నాడు. మరి కూలీ సినిమాలో ఆమీర్ క్యామియో పాత్రకు ఏ రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఆమీర్ అభిమానులు మాత్రం లోకేష్ తో ఆమీర్ చేయబోయే సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంటుంది అని , ఆయన ఆ సినిమాతో అద్భుతమైన కం బ్యాక్ ను ఇస్తాడు అని ఆయన అభిమానులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: